Tuesday, February 17, 2015

మహాశివరాత్రి శుభా కాంక్షల తో ....

శంకరు డా శుభం కరుడు జన్మము నొందగ జేతురే గదా
శంకరు పార్వ తీ  లనిల చయ్యన నొక్కటి గాగ నప్పుడున్
నంకముగా దలంతు రుమ  హాశివ రాత్రిగ నా దినమ్ము నున్
శంకరు దీవెన ల్కరము సంపుటి జేయగ రండు మీ రలున్ 



వంకలు జుట్టినట్టి జడ పాయల మాటున నున్న గంగ మా
వంకన దింపు మయ్యశివ భక్తవశంకర పార్వతీశ మా
సంకట ముల్దొలంగు ముని సన్నుత పిల్లలు పాపలున్ నిరా
టంకపు జీవనమ్మును జనావళి మెచ్చగ జేయరే యిలన్ !!!)



(మంద వారి రచన )

No comments:

Post a Comment