Saturday, February 7, 2015

పద్య రచన - సూర్య కాంతం

గంప గయ్యాళి వేషాన గటువు గలిగి
యెంత మందినో బాధించు నింతి గాను
సూర్య కాంతమ్మ ! నీవిల  బేర్వ డసితి
వి మఱి  వందన  ములునీకు  వేయి యిడుదు

మాట కఠి నము  మెత్తని మనసు గలిగి
సూర్య పదమది ముందునై సొబగు దోపి
కాంతు లొలికించు నీపేరు  కాంత మగుట
సార్ధ కంబయ్యె  నుగదమ్మ ! సాధ్వి నీకు


కళలకు కాణాచి కాకినాడ సమీప
వేంకట కృష్ణరాయాంకితమగు
చిఱుగ్రామ పురవాసి; చిఱుతనంబున వేసి
నాటకములయందు నాటుకొనగ
“నారద నారి” లో నాయిక పాత్రలో
చిత్రసీమను జేరె చిత్ర గతిని
“సూర్యకాంత”మనగ సూరెకారమనెడి
నానుడి నొందిన నాతి యనగ

అత్త రూపుకు క్రొంగొత్త హద్దులిచ్చి
పాత్ర లందునె గయ్యాళి పరమ సాధ్వి!
తనకు సాటిగ మునుముందు తరము లందు
పుట్ట బోరు నటనమందు పుడమి యందు.

 

No comments:

Post a Comment