జనులు దమతమ పనులను సహిత మునిల
బెట్టి ప్రక్కన , జూతురు పిచ్చ గాను
నీ క్రి కెట్టును మఱి వారి కేమి సుఖము
కలుగు నోతెలి యదునాకు , తెలియు మీకు ?
బంతి దెబ్బల తోబాధ పడగ వారు !
పురిటి గ్రుడ్డు కూడ పొరలుచు నటునిటు
చూచు చుండె నిపుడు చోద్య ముగను
నీ క్రి కెట్టు నార్య ! నెంత గా నోమఱి
యెంత యిష్ట మాయె ? ని దియ ప్రజకు
రమ్యముగ జెప్పు చుంటిని రాజరాజ !
రావ లసినట్టి భాగము న్నీవ యీయ
కుండు నెడలన పాండవ కోప ము లవి
మబ్బు లగుచును వానగా మారి యవియ
వరద లైపొంగి బొరలుచు పారు నదికి
నిన్ను ముంతురా నదిలోన నిజము సుమ్ము
చివరి ఘడియలో కురురాజు చేరి కృష్ణు
వరద ! దరిజేర్చు మమ్ముల పాండ వాన
లమ్ము బారి నుం డియుమఱి యిమ్ము గాను
బుణ్య మబ్బును నీకుగా బుణ్య పురుష !
వేరు మార్గమే యనునది వెదుక లేము
ఉల్లి పాయలు జూడుము మెల్ల గాను
నెంత యందము గానుండె ? నెఱు పు తోడ
నెందు వాడిన నిచ్చును నందు రుచిని
ను ల్లి పాయ పకోడీ ని యల్లము మఱి
చేర్చి భావన ! మఱి నాకు జేసి పెట్టు
ఉల్లి పాయలు గలవట చెల్లి ! చూడు
ఎంత యందము గలవియో నంత రుచిని
నిచ్చు ననుటలో సందియ మించు కైన
లేదు నిజమిది నమ్ముము నాదు మాట
తల్లి సమానమే యనుచు నుల్లిని నందురు గాదె పం డితు ల్
ఉల్లియ నిచ్చు గుండె బల మెల్లపు డె ట్లుగ నాహరిం చినన్
అల్లదె యాయువుం బెరుగు హర్షము నిచ్చును నెల్లవే ళలన్
కల్లయు గాదు నా పలుకు నల్లదె వైద్యుని మాటలే మఱిన్
భారత యుద్ధ మందు దశ వక్త్రుని జంపె నృసింహు డుద్ధతి
న్నారయ రావణుండు మఱి భారత మందెచ టుం డె నే గనన్ ?
భారత యుద్ధ మందతని భారము బోవుట వీలుగా నగున్ ?
పారము బొందగో రుప్రజ సారము వేడును నార సింహు నిన్