Friday, June 22, 2018

పదవీ విరమణ శుభా కాంక్షలు !!!


వాసి గాంచు మైలవరపు వంశమందు
పుట్టి తివి  తల్లి దండ్రుల పుణ్య మయన
విద్య లందించు గురువుగా వినుతి కెక్కి
పదవి విరమించు రవీంద్ర! ప్రస్తుతింతు

పదవిని నుండగ దెలియును
పదవీ  విరమణము , గొప్ప వరమగును గదా
పదవీ విరమణ జనులకు
పదికిం  బది మార్లు శివుని బ్రార్ధన  జేయన్

పదవిని నుండగ జేయము
సదయుండగు శివుని బూజ సాకారముగన్
పదవులు దొలగిన జేతుము
పదవీ విరమణము గొప్ప వరమగును గదా .

ఎంద రెందరికో విద్యనంద జేసి
యోగ్యులుగ తీర్చి దిద్దిన యోధ వగుచు
 స్ఫూర్తినిచ్చిన సౌజన్య  మూర్తి వీవు
సాటి యెవరును లేరు నీ సాటి వారు

నవ్వు చిందించు మోముతో నమ్రుడవయి
సత్య మార్గమే ప్రగతికి నిత్యమనుచు
నీతి నియమాలు దప్పక నిర్మలముగ
సేవ లందించితివిగద చేవ జూపి

తడబడని నడక నేర్పుచు
నడుగడుగున వెలుగులనిడు  నాదిత్యుడవై
గడిపితివి గతము నంతయు
బడిపిల్లల మద్య నీవు భాసుర లీలన్

సకల శుభములు గలిగించు శంకరుండు
నాయురారోగ్య సంపద లన్ని యిచ్చి
కంటికిని ఱెప్ప  యట్లయి కాచుగాత !
యెల్ల వేళల మిమ్ముల జల్ల గాను

ఆశీస్సులతో .......
పోచిరాజు సుబ్బారావు






No comments:

Post a Comment