Wednesday, November 30, 2011

తప్పొప్పులు

తప్పొప్పులు సరి చూడుము
తప్పుకి తావీయ కుండ నొప్పులు సేయన్
తప్పక మది యత్నించుము
ఒప్పులె రక్షించు నయ్య ! నెప్పటి కైనన్ .

ప్రా ర్ధన

ఆశ

ఆశ యొక అయ స్కాంతము
ఆశను "ఎర " జూ పు నెడల నధికులునైనన్
వశ్యులు నగుదురు నిక్కము
ఆశకు మఱి "అంతు" నుండ నాసింతు నికన్ .

బిక్క మొహము

చక్కని పద్యము వ్రాయను
పక్కాగా ప్లాను వేసి పదములు వెదకన్
నొక్కటియు దొరక నందున
బిక్కంబగు మోముతోడ విరమించితి నిన్ .
-----------------------
వ్రాయను అనగా వ్రాయుట కొరకు

మనుగడ

మనుగడ కోసము తినవలె
మనుగడ మఱి యుండ రాదు తినడము కోసం
మనుగడ యొక పరమా వధి
మనుగడయే గొప్ప వరము మానవుల కిలన్ .

నీ ఛ కార్యము

పర భాషా వ్యామోహము
పర కాంతల సంగ మంబు పర ధన వాం ల్
పర హింసా చతురోక్తులు
నరయంగా నీచ మైన కార్యము లయ్యా !

Tuesday, November 29, 2011

కామ పిశాచి

కామము వలనన కోపము
కామము మఱి బంధు జనుల కాటికి పంపున్
కామము వినాశ హేతువు
కామము నిక వీడు మయ్య! కామ పిశాచీ!

పాయని నిజము

భార్యాదాసులు నేర్వరు
ఆర్యుల భావంబు లకట యాహా యేమీ
భార్యా మణి కను సన్నలె
పర్యవసానంబు లగుట పాయని నిజమా ?

మృత్యుంజయ మంత్రము

ఓం త్రయంబకం యజా మహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ మ్రుత్యీయ మామ్రుతాత్ .
మననము జేసిన మంత్రము
మనుగడకే స్ఫూర్తి నిచ్చు మహామాన్వితమై
మనన మె తను బ్రతి కించును
మననము నున్ జేయుమయ్య ! మృత్యుం జయమున్ .

మోక్ష ప్రాప్తి

నిత్యము భగవన్నామము
ప్రత్యేకం దావు లందు పలికిన యె డలన్
సత్యము మోక్షము వారికి
సత్యముగా జెప్పు చుంటి సతతము వినుడీ.

Monday, November 28, 2011

సమస్యా పూ రణం

తెలుగేలా! యాంగ్ల భాష తియ్యగ నుండన్
----------------------------------------------
తెలుగును నేర్చిన యె లన
ఫలితము మఱి గాన రాదు పర దేశములన్
దులువల మాటలె యీ యవి
తెలుగేలా ! యాంగ్ల భాష తియ్యగ నుండన్ .

కోపము

కోపము షుగరును బెంచును
కోపము నన రక్త పోటు కూడా వచ్చున్
కోపము వినాశ హేతువు
కోపము నిక వీడుమయ్య ! కుజన విరోధీ !

సమస్యా పూ రణం

దోష కాల మొసంగు సంతోష గరిమ
----------------------------------------
తీయ తీయని భావాలు తేనెలొలుక
పిల్ల గాలులు మనసును పల్ల విం
గగన భాగంబు నారుణ కాంతు లంప్ర
దోష కాల మొసంగు సంతోష గరిమ .

నా ర్తు అమెరికా ప్ర కృతి రహస్యము

అక్టోబరు నెల వచ్చిన
ఆకులు తమ రంగు మార్చి యందము నిచ్చున్
ఇక్కడ గల చెట్లన్నియు
నేకముగా మోడు లగును నేప్రిలు వరకున్ .

fever is good for us

Sunday, November 27, 2011

పిట్సు బర్గ్ ప్రయాణము

వెళ్లి తిమి పిట్సు బర్గుకు
వెళ్ళితిమా వేంకటేశు బెండిలి సేయన్
కళ్యాణము గిరి ధరునకు
భళి భళి యను నటుల జరిగె భక్తుల నె దు న్ .
-------
అట నుండి సాయి గుడికిని
నెటు పోవలె నంచు నడిగి నేగితి మటకున్
నట వెలయు సాయి నాధుని
కణ కువగా నుండి యచట యర్చించి తిమిన్ .
----------
చూసితిని కొండ లోయలు
చూసితినా యడవి దారి సొగసులు మిగులన్
చూసితిని పాక శాలను
చేసితి మఱి భోజనంబు చిక్కని దధి తోన్ .
-------------
చూసితి పేలసు గోల్డును
చూసితి ప్రభు పాద గురుని చూసితి కృష్ణున్
చూసితి భక్తుల నృత్యము
చూసితి మఱి రాజ హంస చూడ్కులు ,నడకల్ .
------------
చూసితిని మ్యూ జి యమ్మును
చూసితి నట ధూమ శకట చోద్యపు నడకల్
చూసితి విద్యుత్కాంతులు
చూసితి మిరుమి ట్లు గొలుప చుక్కల రాజున్
-------------
కారు చీకట్లు చుట్టున కమ్ము కొనగ
దారి పొడుగున వర్షంపు ధార లొలుక
పాడు కొంచును పాటలు పాత వెన్నొ
చేరు కొంటిమి యింటికి సేమముగను.

సమస్యా పూ రణం

పని పాటులు లేనివా డె పద్యము లల్లున్
--------------------------------------------
పని పాటు లున్న వారును
పని గట్టుకు వ్రాయు చుండ్రి పద్యము లెన్నో
అనుచిత భావ యీ యది
పని పాటలు లేని వాడె పద్యము లల్లున్ .

మానవ సేవ

మఱువకు మానవ సేవను
మఱువకు మఱి బంధు జనుల మఱు వకు శివునిన్
మఱు వకు నీ కర్తవ్యము
మఱు వకు నిక మా తృ సేవ మహిలో శిష్యా !

Wednesday, November 23, 2011

శ్రీ రామ రక్ష

మంచిని చేయుము , చూడుము
మంచియె శ్రీరామ రక్ష మానవుల కిలన్
మంచియె దేవుని రూపము
మంచికి నిల సాటి లేదు మఱి యొక గుణమున్

థాంక్సు గివింగ్ డే

అల్టిమేటు ట్రూత్

Tuesday, November 22, 2011

శుభములు

కులమును గుణముల రెంటను
నలరించెడి గుణము మిన్న కులమున కంటెన్
కులమును గుణములు రెండును
కలిగిన కుల కాంత కెపుడు కలుగును శుభముల్ .

పతనము

పాతకముల నైదింటిని
సతతము విడనాడు వాడు సత్పురుషు డిలన్
పాతకము నొనరించిన
పతన మె మఱి యొండు లేదు పరిశీ లింపన్.

Monday, November 21, 2011

తప్పొప్పులు

తప్పులని తెలిసి యుండియు
తప్పులు దా జేయువాడు దండార్హు డగున్
ఒప్పులు జేసెడి మనుజుని
నెప్ప టికిని మఱువ కునికి నెంతయు నొప్పున్ .

బ్రెయిన్ స్టడీ

దిగువన ఒక వాక్యము వ్రాయడమయనది .పూరించ వలసినది

Sunday, November 20, 2011

జన్మ సాఫల్యత

తల్లి దండ్రుల సేవలో దరియు నెవడు
పూజ్య గురువుల మన్నన బొందు నెవడు
పరుల బాధలు దొలగించు భవ్యు డె వడు
వాని జన్మము ధన్యము వసుధ లోన.

Saturday, November 19, 2011

వెఱ్ఱి బాగులోడ !

నేను నేనను నహము తా నిన్ను పట్టె
నేమి సేతువు ? వచ్చితి వెచటి నుండి ?
పుట్టు మనుజుడు తప్పక గిట్టు కతన
భ్రాంతి విడనాడు మిక వెఱ్ఱి బాగు లోడ !

సంసారము

సాలి గూడున జిక్కిన శలభ మకట
తన్ను కొనుచును గిల గిల తనువు విడుచు
పగిది మనుజుడు సంసార పంకిలమున
మునిగి దేలుచు జీ వించు మూర్ఖము నన .

యాగశాల

హారము పవిత్ర మైనది
హారము నొక యాగశాల యారని వెలుగున్
హారము సుకవుల వలయము
హారము మన పుణ్య ఫలమె యనుటను సబబే .

Friday, November 18, 2011

కలికాలము

కలికాలము చె డుకాలము
కలి పురుషుడు రాక కతన కలి యుగమునకున్
బలవంతులు ,దుర్మార్గులు
పలువురు దెగ రెచ్చి పోయి బాధింతు రిలన్ .

కాలమహిమ

కాలము విచిత్ర మైనది
కాలము కలిసొచ్చి నపుడు కనకము కురియున్
కాలము గతి వక్రించిన
కాలుడు ధన హీను జేయు కలవానినినిన్ .

Thursday, November 17, 2011

హారం

హారము చదువుల నిలయము
హారము నొక మంచి సొగసు నాం ధ్రా వనికిన్
హారము సాహితి పరులకు
హారమునకు సాటి లేదు యావద్భువి లోన్ .

Monday, November 14, 2011

చిల్ద్రన్సు డె

నె హ్రూ పుట్టిన రోజా
చారముగా చేసి కొండ్రు చిల్డ్రన్ డేగాన్
సరి వయసు పిల్ల లందఱు
రోజున నాడు కొండ్రు నాటలు బెక్కుల్ .

Saturday, November 12, 2011

జాతికి మేలు

సూక్తులు సెప్పుట తేలిక
ఉక్తంబులు నమలు పరచు టెం యొ కష్టం
సూక్తులు సదివిన పిమ్మట
రిక్తుడు గా నుండ కునికి జాతికి మేలౌ .

Thursday, November 10, 2011

లేఖ

పంపిన పద్యము జూడక
పంపిరి యీ మెయిలు నాకు మాధవు గారూ!
పంపిన పద్యము నొకపరి
సంపూర్ణము చదువుడయ్య! సవరణ సేయన్ .

మమతల కోవెల

మమతల కోవెల సిరియలు
సమతా భావంబు మరియు సమ తుల్యముగాన్
మమతలు నింపుచు నుండెను
విమతుల కది రోత యయ్యె వీ క్షిం పం గాన్ .

పోకుము

పోకుము వేశ్యుల కొంపకు
పోకుమురా యర్ధరాత్రి పొరు గిండ్లకునున్
పోకుము దుష్టుల యొద్దకు
పోకుమురా యిల్లు విడిచి పురుషోత్తముడా!

Wednesday, November 9, 2011

డబ్బు

డబ్బే మూలము జీ వికి
డబ్బేలే జీ వితంబు డబ్బే శ్వాసా
డబ్బే యూపిరి యాయువు
డబ్బే సర్వశ్వమంచు డబ్బు నె గొలుతుర్.

అన్న దానము

అన్నము కంటెను దానము
మిన్నగ వే రొండు గలదె మేదిని జూడన్
అన్నా ! నీ వే జెప్పుము
అన్నమున నె దృప్తి జెందు రందఱు నిచటన్ .
అన్నము జీ వికి ముఖ్యము
అన్న మె దానాల లోన నత్త్యుత్తంబౌ
అన్నము మించిన దానము
యెన్నటికిని గాన రాదు నెందున వెతకన్ .

బాలలు

బ్రిటానియా బిస్కట్టు లు
తింటారా మీ రలిపుడు తీతీ యగాగా
ఆటలు ఆడుచు పాడుచు
పా ఠా లిక నేర్చు కొనుడు బాలలు మీ రల్.

Sunday, November 6, 2011

మంచి

మంచిని మంచిగ జూసిన
మంచియె నీ వెంట యుండి మంచిగ జేయున్
మంచిగ యుండుట వరమది
మంచిని విడనాడ కెపుడు మను వంశజుడా!

Friday, November 4, 2011

తృప్తి

తృప్తియె సుఖమును నిచ్చును
తృప్తియె యాయువును   బెంచు తృప్తియె బలమున్
తృప్తియె వరమది మనిషికి
తృప్తియె మఱి కలుగు వాడు నృగవుడు ధరలోన్

Wednesday, November 2, 2011

ఎడబాటు

అడుగులకు మడుగు లొత్తుట
ఎడబాటు కు దారి తీ యు నెక్కడ నైనన్
అడగక బోయిన జెప్పుము
ఎడబాటును లేక యుండ యేలు కొ మనుచున్ .