వెళ్లి  తిమి  పిట్సు బర్గుకు 
వెళ్ళితిమా  వేంకటేశు బెండిలి   సేయన్ 
కళ్యాణము  గిరి  ధరునకు 
భళి  భళి  యను  నటుల  జరిగె భక్తుల  నె దు   ట న్ .
                              -------
అట  నుండి  సాయి  గుడికిని 
నెటు పోవలె నంచు   నడిగి  నేగితి  మటకున్ 
నట  వెలయు  సాయి నాధుని 
కణ కువగా  నుండి  యచట  యర్చించి  తిమిన్ .
                   ----------
చూసితిని  కొండ  లోయలు 
చూసితినా యడవి  దారి  సొగసులు  మిగులన్ 
చూసితిని  పాక  శాలను 
చేసితి  మఱి  భోజనంబు  చిక్కని  దధి తోన్ .
                    -------------
చూసితి  పేలసు గోల్డును
చూసితి  ప్రభు  పాద గురుని  చూసితి  కృష్ణున్ 
చూసితి  భక్తుల  నృత్యము 
చూసితి మఱి  రాజ  హంస  చూడ్కులు ,నడకల్ .
                             ------------
చూసితిని  మ్యూ జి యమ్మును 
చూసితి  నట  ధూమ శకట  చోద్యపు  నడకల్ 
చూసితి  విద్యుత్కాంతులు 
చూసితి  మిరుమి ట్లు  గొలుప చుక్కల  రాజున్ 
                              -------------
కారు  చీకట్లు  చుట్టున  కమ్ము కొనగ 
దారి  పొడుగున వర్షంపు  ధార లొలుక 
పాడు  కొంచును  పాటలు  పాత  వెన్నొ
చేరు  కొంటిమి  యింటికి  సేమముగను.
 

బాగుంది మీ ప్రయాణం! అయితే సంపూర్ణ పిట్సుబర్గు యాత్ర చేశారనమాట! సంతోషం!
ReplyDeleteరసజ్ఞ గారికి నమస్కారములతో కూడిన కృతజ్ఞతలు .
ReplyDeleteశేషశైలుడు పిట్సుబెర్గ్ వాసుని
ReplyDeleteఅమరికగా సాయిని
ఆ 'మెరిక' ప్రకృతి ని
గాంచె అయ్యవారు
అది జాలువారె తేనెలూరు తెలుగున
రావు,కవితాఝరి రావు వేరోక్కరికి !
జిలేబి గారికి కృతజ్ఞతలు
ReplyDelete