Tuesday, December 6, 2011

చాటువులు

తమ యీ సమస్య పూ రణ ,
సమస్య గా మారెనయ్య! శంకరు సామీ !,
సమయములు కుదర నందున ,
సమ భావము లీ యనేర సారీ యండీ!
-----------------------------------
నమములు గురు తుల్యులకును ,
నమములు మఱి శంకరయ్య సామికి నమముల్,
నమముల తొ గోరు చుంటిని ,
నిమ్ముగ నడ్రస్సు మీ ది నీ యుడు నిచటన్ .
--------------------
నవ వధువు జూడ మధురము ,
నవ నవ లాడంగ నుండి నవ్వుల మోమున్ ,
నవ్వులను గలుగ జేయుచు ,
సద్వనిత బేరు పొందు సహ వనితల లోన్ .
-----------------------------------------

58 comments:

  1. మనసుకు నచ్చిన వానిని
    మనువాడుట తప్పు యనను మఱి వానికి నీ
    మనసును నచ్చిన దైన చొ
    మనువును సాగించు మమ్మ! మమతల చెల్లీ!
    -------------------
    దిక్కుల నన్నిటి యందున
    దిక్కును నల తూర్పు మరియు దిక్కుత్తరమున్
    చక్కటి శుభముల నిచ్చును
    పక్కాగా నెంచు కొనుము పాయక తుర్పున్ .

    ReplyDelete
  2. చేయకు సజ్జన దూ ష ణ
    చేయకు మీ దొంగతనము చేయకు హింసన్
    చేయకు పరసతి గమనము
    చేయకుమా యెల్లయెడల చేటును ప్రజకున్ .

    చేయుము సజ్జన స్నేహము
    చేయుము దానాలు మిగుల చేయుము శాంతిన్
    చేయుము ధర్మము లెన్ని యొ
    చేయుమయా పాదసేవ సీ తా పతికిన్

    రారా యని నిను బిలువగ
    ఏరా నివు రాక యుంటి వేమిటి కతమున్
    ఓరోరి యెందు కేగితి
    రారా నివు తప్ప కుండ రాత్రికి నిటకున్.

    చేసిన పాపము లన్నియు
    వాసిగ నిల లెక్క కొచ్చి బాధించు నినున్

    చేసిన పుణ్యము లన్నియు
    రాసులు గా బ్రోగు జెంది రక్షణ నిచ్చున్ .

    సంపాదించుము నీ తిగ
    సంపాదన నుండరాదు స్వార్ధము కొరకున్
    సంపద పదియవ భాగము
    పెంపొంద గ బంచి బెట్టు పేదల కెపుడున్

    పాండవ మధ్యము డొక్కడ
    కుండలములు కలిగి యున్న కుంతీ పుత్రున్
    దండించ గ సమరంబున
    దండంబులు బెట్టిరపుడు దండిగ జనముల్

    సంసారాంబుధి దాటను
    కంసారికి గష్ట మయ్యె కావ్యము లోనన్
    సంసార మనిన నెయ్యది ?
    సంసార మె దుఃఖ మండ్రు సకల జ్నులిలన్

    పలికెదను రామ కధ నిల
    పలుకంగా శక్తి నీయ పలుమరు గోరన్
    పలుకక మిన్నక యుంటివ ?
    పలుకే బంగారు మగునె? పావన రామా !

    మనసుకు నచ్చిన వానిని
    మనువాడుట తప్పు యనను మఱి వానికి నీ
    మనసును నచ్చిన దైన చొ
    మనువును సాగించు మమ్మ! మమతల చెల్లీ!

    పలుకుదును రామ భక్తని
    పలికించెడి వాడు రామ భక్తు డె మఱి నే
    పలికిన పుణ్యము కలుగు చొ
    పలికెద వేవేగ నిపుడ పలుమరు సార్లున్




    ఆచార్య మీ కు నమములు గోచారము గూర్చి జెప్ప కోరుదు మిమ్మున్ గోచరమైనవి సెప్పుడుగోచారము వలన కలుగు గోప్యము లెల్లన్ .
    ఆకాశ వాణి సెప్పెను
    ఆకస యానంబు మిగుల నయ్యును ప్రియమున్
    ఆకస పయనపు జతనము
    వేగిరముగ మాను కొండు వేవేల్ మిగులున్

    లైలా తుఫాను వచ్చెను
    ఏ లాగయ మేము బతుక నేమిటి గమ్యం
    వేళాకోళము గాదిది
    ఆలోచన జేసి జెప్పు నార్తియ తొలగన్.

    హరిహర భవులకు నమములు
    హరి హర భవులార మీ ర లారాధ్యలరౌ
    హరియించుడు పాతకములు
    హరియింప గ వేడుకొందు హరి హర యనుచున్

    లంచాల జోలి పోవక
    మంచిగ నిల జేసి కొనుము మమత తొ జాబున్
    లంచాలు తీసి కున్న చొ
    లంచంబుల సామి యండ్రు లంచాలిస్తూ .

    పాపపు పని మది తలపకు
    పాపములే నిన్ను పంపు పాతాళముకున్
    పాపము లనదగు పనులను
    ఏ పొద్దున జేయకునికి నెంతయు నొప్పున్ .

    అడుగులు వేసిన రోజున
    వడి వడిగా నిన్ను జేర వచ్చుచు నుండన్
    తడబడి బోర్లా బడితిని
    విడువక నన్నేలు కొనుము వేంకట రమ ణా!

    ఏడు కొండల మీదున్న వేంకటేశ!
    మమ్ము గాపాడ దిగిర మ్ము మంగతోడ
    ముసలి పండుల మైతిమి ముదిమి వలన
    మేము రాలేక గోరితి మిమ్ము సామి !

    కర్మను ఘాటు కపీశుని
    కూర్మి తొ సేవించు నెడల కోరిక లణచున్
    నర్మములు పలుక కుండగ
    నిర్మల చిత్తంబు తోడ నెరపుము పూజల్ .

    వైయస్సు కొడుకు జగనుడు
    వైయస్సును బోలియుండి ఎన్ని యొ తావుల్
    పయనించి యూర దించెను
    అయ్యయి చోటుండు జనుల నార్తిం బోవన్ .

    రెడ్డి కులమున బుట్టిన దొడ్డ దేవ
    ఇంద్ర సేనాభిదేయుడై నిలను వెలసి
    మంచి యొ జ్జగ పేరున్న మహితుడీ వ !
    అందుకొనుమయ్య సాదర వందనాలు

    ఇంద్ర సేనుడ !ఎచ్చటికేగితీవు
    వచ్చియుంటిని మీ ఇంటి వరకు నేను
    కాన రావాయె గురువర ! కంటి కపుడు
    మరల వత్తును జెప్పుడు మాదు రాక .

    దిక్కుల నన్నిటి యందున
    దిక్కును నల తూర్పు మరియు దిక్కుత్తరమున్
    చక్కటి శుభముల నిచ్చును
    పక్కాగా నెంచు కొనుము పాయక తుర్పున్ .

    రక్షించు జీవకొటిని

    రక్షించును నిన్ను గూడ రాగము తోడన్

    రక్షించు వాడు హరియట

    తక్షణమే వేడుకొనుట తగును కుమారా !

    ReplyDelete
  3. note:changed 3rd poem as follows

    నవ వధువు చూడ మధురము
    నవ నవ లాడంగ నుండి నవ్వుల మోమున్
    అవయవ పుష్టియు కలిగియు
    వనితల లోకెల్ల మంచి వనితగ నుండున్

    ReplyDelete
  4. మనసున యందలి బాధలు
    మన వారితొ జెప్పు కుంటె మాయము లగునున్
    అనునది పెద్దల మాటయ
    కనుకనె మరి చెప్పు చుంటి కాంతా ! నీతోన్ .
    -------------
    అమెరిక లో నున్నందున
    సమయంబుల మార్పు వలన సరి యగు కృ షి యున్
    నేమియును జేయ నైతిని
    ఉమయే యిక నిచ్చు గాక ! నోపిక దయతోన్

    ReplyDelete
  5. కొందరి పడకల రూముల
    అందములకు మార్కు లేయ యర సున్నలులే
    అందులొ మీ గది వచ్చును
    కిందన గల కిచను రూము నందుకు సరియే.

    ReplyDelete
  6. పదవుల చద రంగం
    ----------
    పదవుల చద రంగములో
    కదలిక గల పాము లెన్నొ కనుగొన వలయున్
    పదవుల పంపక మి చ్చట
    పదునుగ మఱి సాగు చుండె పరి కించండీ!

    ReplyDelete
  7. పండిత నేమాని వారి పద్యము ,పద్యము గురించి
    -------------
    పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
    సాద్భుత రచనా మహత్త్వ ఫలము
    పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
    వీచీ విలోల కవిత్వ మయము
    పద్యమ్ము సముచిత పద గుంఫనోపేత
    రస విశేష పటుత్వ రాజితమ్ము
    పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
    బాహుళ్య రుచిర సంపల్లలితము
    సాహితీ నందనోద్యాన జనిత పారి
    జాత సుమధుర సౌరభ సార కలిత
    పద్యము మనోహరాకార వైభవమ్ము
    భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి

    ReplyDelete
  8. తిమ్మెర లెక్కెనె ?
    --------
    తిమ్మెర లెక్కెనె దేహము?
    ముమ్మూర్తుల నేక రూపు ముక్కంటిని యు
    ధ్ధమ్ముకు రమ్మను చుంటివి
    యమ్మాయిలు లేర నీకు నారా ధించన్ ?

    ReplyDelete
  9. మినీ కవిత
    -----------
    అమ్మా బ్లూమింగ్ డేలా
    బాగున్నావా
    ఆ .... యెవరు మీరు
    నేనమ్మా
    పర దేశ వాసిని
    బాగున్నారా ...అండీ
    బాగున్నాం అమ్మా
    చప్పండి
    ఏం చెప్పను అమ్మా
    మీ దేశం వేరు
    మా దేశం వేరు
    మీ వేషం వేరు
    మా వేషం వేరు
    మీ భా ష వేరు
    మా భాష వేరు
    మీ అలవా ట్లు వేరు
    మా అలవాట్లు వేరు
    మా దేశం వస్తావా ...అన్నావు
    ఊ అన్నాను
    టిక్కెట్టు తీయనా అన్నావు
    ఊ అన్నాను
    ఇంకో నాలుగు నెలలు ఉంటావా అన్నావు
    ఊ అన్నాను
    కాదు కాదు జనవరి లో వెల్లిపో అన్నావు
    ఊ నీ ఇష్టం అన్నాను
    నీవు రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి
    మా ఇష్టా అయి ష్టాలతో పని లేదా
    అవున్లే దేశం మీది కదా
    గుడ్బై

    ReplyDelete
  10. హైదరాబాదు ప్రయాణము
    ------------

    వచ్చితి హైదర బాదుకు

    వచ్చితి యూ యస్సు నుండి వచ్చితి నిన్నన్

    హెచ్చగు శీ తము నోర్వక

    పెచ్చగు నుష్ణంబు కొరకు నిచ్చ తొ నిటకున్.

    ----------

    వత్తును హైదర బాదుకు

    వత్తును యూ యస్సు నుండి వత్తును తొరలో

    వత్తును శీ తము నోర్వమి

    వత్తును నుష్ణంబు కొరకు వత్తును నటకున్.

    ReplyDelete
  11. తప్పుల నెన్నుట సులభము
    తప్పులు మఱి నెన్ను వారు తమ తప్పులునున్
    తప్పక మొదటన నెఱిగిన
    నొప్పును నిక ముందు కేగ నోపును జగమున్

    ReplyDelete
  12. శంకరా భరణము
    -------
    శంకరు నాభరణ మునే
    నంకం బుగ జేసికొనిన శంకరు సామీ!
    బింకంబ గు మీ బంధము
    వంకల కిల తావు లేదు వందన మయ్యా !

    ReplyDelete
  13. అనుభూతి
    ------
    పడమటి సంధ్యా రాగము
    కుడి యెడమల గోచరించు కుంకుమ రంగున్
    ఒడు దొడుకుల మేఘంబులు
    ఎడ దం నే హత్తుకొనియె నిప్పుడు నాకున్ .

    ReplyDelete
  14. క్రమస్థ సర్వవ్యంజనం
    క్రింది శ్లోకంలో అన్ని హల్లులూ వరుసక్రమంలో ఉన్నాయి.

    కః ఖగౌఘాఙచిచ్ఛౌజా
    ఝూఞ్ జ్ఞోటౌఠీడడంఢణాః |
    తథోదధీన్ పఫర్బాభీ
    ర్మయోऽరిల్వాశిషాం
    -------


    హల్లుల వరుసలు సూచితి
    నెల్లర కవి యోగ్య మగును బిల్లలు కూడా
    మెల్లగ నేర్చుట సులభము
    అల్లదె భావంబు కూ డ హర్షించ దగున్ .

    ReplyDelete
  15. ఆరోగ్యమే మహా భాగ్యము
    ---------
    ఆరోగ్యమ్ము గ నుండుమ
    యారోగ్య మె భాగ్య మండ్రు నార్యులు జగతిన్
    నారోగ్య వంతు లిలలో
    నారాటము లేక యెపుడు హాయిగ నుండున్ .

    ReplyDelete
  16. శంకర !
    -------

    కనుముర,శంకర ! జగమును
    కనిపించె నె,పూ జగదులు కంటికి నీకున్
    కనుముర,భక్తుని నొక్కని
    కనరాడుర ,నీకు మూడు కన్నుల జూడన్ .

    ReplyDelete
  17. తాటి పండు ---తియ్య గుండు
    --------
    తాటి పండు చూడ తామ్ర వర్ణము నుండు
    తొక్క కాల్చి చూడు నొక్క సారి
    ముదురు రంగు తోడ ముచ్చటగను నుండి
    తినుట మొదలు బెట్ట తియ్య గుండు .

    ReplyDelete
  18. వరకు నె తెలియున్
    -----
    వెలదుల హొయలపు సొగసులు
    వెలగట్ట గ జాల రయ్య !విటులును సహితం
    వలపుల తియ్యం దనముల
    వలివేసుకు నేక మగుట వరకు నె తెలియున్ .

    ReplyDelete
  19. శూన్య జగత్తు
    --------
    చూసితి శూన్య జగత్తును
    చూసితి నే నిదుర లోన సూర్యుని , చంద్రున్
    చూసితి నానందంబున
    చూసితి మఱి శంభు నుమను జూసితి హనుమన్.

    ReplyDelete
  20. గొప్పలు ---తిప్పలు
    -----
    గొప్పలు సెప్పుట మానుము
    గొప్పలు మఱి కూడు వెట్ట వెప్పుడు నీకున్
    గొప్పలు సెప్పుట వలనన
    తిప్పలు రా వచ్చు నయ్య ! తెలియుము నరుడా !

    Zilebi said...
    గొప్పలు జెప్పకున్న ఈ భువిలో
    నిక్కముగ గడ్డిపోచ భావించెదరు
    కుప్పలుగా గొప్పలు జెప్పి
    కడు గీర్తి గనుమా జిలేబి !

    ReplyDelete
  21. తిరుమల -తిరుపతి
    ------
    తిరుమల తిరుపతి కేగిన
    తిరుమల శ్రీ వేంకటేశు ,తిరుమల నాధున్
    తిరుమల నలివేల్మంగను
    సురుచిర మగు పట్టణంబు జూడుము పుత్రా !

    ReplyDelete
  22. ఆర్యులా ర !
    -----
    కంద కూ రను బోలిన కంద పద్య
    మాట వెలదిని నలరిన నాట వెలది
    తేట కాంతులు నింపిన తేట గీ తి
    నాల పించుడు విందును నార్యు లార!

    ReplyDelete
  23. రచనోత్సాహము
    -----
    రచనో త్సాహము నన్నిట
    రచనలు సేయించు చుండె రచనల నెన్నో
    రచనల భావము లన్నియు
    సుచరితము గ నుండె లేవొ? సూచించం డీ!

    --
    Zilebi said...
    నుండె లేవొ అన్న మీమాంస మీకు వలదు ఆర్యా
    మీరు ఏమి వ్రాసినను అవి సుచరితములే !

    చీర్స్

    ReplyDelete
  24. కుం దన మమ్మా!
    ---------
    అందమగు నాడ పిల్లల
    నెంద రినో జూ చుచుంటి నందరి లోనన్
    అందము నీదే గొప్పది
    అందున సందియము లేదు కుందన బొమ్మా !

    ReplyDelete
  25. మరణములు
    ------
    మరణములు మూడు విధములు
    మరణము లవి యాత్మ హత్య ,మరణము చంపన్
    మరణము సహజము శ్రేయము
    మరణము లిక పైవి రెండు ప్రేరణ భూతుల్.

    ReplyDelete
  26. మన పుణ్యం
    ----
    మనది యన నేది జగమున
    మన సంపద కలిమి బలిమి మన గౌరవమున్
    మన వెంట రావు నిజమది
    మన పుణ్య మె తోడు వచ్చు మనతో గూడన్ .

    Zilebi said...
    పుణ్యము తోడు వచ్చిన దానితో
    కూడి పాపమును వెనువెంటనె వచ్చును
    రెంటినీ విడచి ఆ పరంధాముని
    సేవింపవే జిలెబి ఖచ్చితముగ ఇది పరమపదము !

    ReplyDelete
  27. ఉత్తరము
    ----
    కుశలం బందరు నిచ్చట
    కుశలం బుగ మీ రలుంట గోరుదు మదినిన్
    కుశలం బగు మీ వార్తలు
    విశదంబు గ దెలుపు డ య్య !వీనుల విందౌ .
    Zilebi said...
    ఉత్తరము నేటి ఈ మెయిలు ఎస్సేమేస్సులు
    ఇవి వీనుల కి ' విండో ' !
    కనుల కి కలేడో స్కోపు !
    e మైలులు ఖండ ఖండాంతరాములు కనులు మూసి తెరుచు లోప పోవును !
    అయినను ఎందుకో మానవునికి 'హెవీ' కమ్మ్యూనికేషన్ గ్యాప్!

    ReplyDelete
  28. ఇకార, అకార విశిష్ట శ్లోకం

    క్రింది శ్లోకం పూర్వార్ధం ఇకార విశిష్టమై, ఉత్తరార్ధం అకార విశిష్టమై ఉన్నది.

    క్షితిస్థితిమితిక్షిప్తి
    విధివిన్నిధి సిద్ధిలిట్ |
    మమ త్ర్యక్ష నమద్దక్ష
    హర స్మరహర స్మర ||

    తాత్పర్యం
    ఓ ముక్కంటీ! సర్వజ్ఞా! లయకరా! అష్టవిధశక్తి శాలీ! భూతిదాతా! దక్ష మన్మథ సంహారా! నన్ను కాపాడు.

    ------
    కాపాడు మయ్య !మమ్ముల
    నేపాపము సేసి యెఱుగ మేవేళల లోన్
    మీ పాద సేవ చేతుము
    మా పాలిట దైవ మీవె మంజుల నాధా !

    ReplyDelete
  29. పావన చరితా !
    -------
    ఎదిరికి హితమును జేయుచు
    మదినిని సంతోష బెట్టు మాటల చేతన్
    పదుగురి బాటనె నడచుచు
    పదిలముగా బ్రతుకు నెపుడు పావన చరితా !

    ReplyDelete
  30. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు:

    నవ వర్షాగమ పర్వ వైభవ మహానందాతిరేకాన్వితో
    త్సవ సంరంభమయాంతరంగ జనితోత్సాహమ్ముతో మిత్ర బాం
    ధవ సందోహము విందులొందగ లసత్ సాహిత్య సౌగంధ పూ
    ర్ణవచస్సుమ రాజితో తెలుపుదున్ భాగ్యప్రదాకాంక్షలన్

    ReplyDelete
  31. సోదర సోదరీమణులకు నూతన ఆంగ్ల సంవత్సర (2012)
    శుభాకాంక్షలు .
    ----
    గైకొనుడు శుభాకాంక్షలు
    గైకొనుమా యాంగ్ల వత్సరాభ్యుదయమునున్
    గైకొని యాశిసు లీయుడు
    గైకొందును దప్ప కిపుడు గై దం డల తోన్ .

    ReplyDelete
  32. శివ రాత్రి
    శ్రీ రమ ణాయ నమః
    --------------
    తొలి యరు ణా చల లింగము
    కలిగెను ధనువు నెల నార్ద్ర ఘన లింగమునన్
    వెలివడు శివుని హరి సురలు
    గొలిచిన దినమె శివరాత్రి కుంభపు నెలనౌ.

    ReplyDelete
  33. పూజ్యుడు
    ------
    ఎవ్వని వలనన పుట్టుక ?
    యెవ్వని మఱి వలన చావు లెవ్వని వలనన్
    నెవ్వని వలనన మనుగ డొ ?
    యవ్వాడే పూజ్యుడవని నందరి కంటెన్

    ReplyDelete
  34. అల్లం పచ్చడి
    -----
    అల్లము బెల్లము కలిపియు
    పుల్లనకై చింత పండు ,సాల్టును కలిపీ
    మెల్లగను మిక్సి కేసిన
    అల్లం చట్నీయ యగును నట్టుల రుచికిన్
    ----
    Zilebi said...
    అల్లన పిల్లలను కలిపియు
    జల్లన పిల్లతెమ్మరలో వాకింగు కి వెళ్ళిన
    మెల్లగ మనసు కి వచ్చిన
    చల్ల దనం జిలేబి ని మైమరపించెన్!

    ReplyDelete
  35. శు భా కాంక్షలు
    -----
    ఆది దంపతు లైనట్టి యాది దేవు
    లాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రెప్ప యట్లయి గాచు గాత!
    కంది శంకరు గురువుని గరుణ తోడ .

    ReplyDelete
  36. అడిగిన తేదీ 1 - 1 - 2012 అనుకుందాం.
    -----
    (అ) 2012 - 1900 = 112 (ఇచ్చిన సంవత్సరంనుండి 1900 తీసివేయగా 112 వచ్చింది)
    దీనిని 4 చేత భాగించాలి.
    (ఆ) 112 / 4 = లబ్ధం 28, శేషం 0 వచ్చింది. (శేషాన్ని వదలివేసి, లబ్ధం (28)ను తీసికోవాలి) దీనికి 112 ను కలపాలి.
    (ఇ). 28 + 112 = 140. దీనికి తేదీ కలపాలి.
    (ఈ). 140 + 1 = 141. దీనికి నెల సంకేతసంఖ్య కలపాలి.
    (ఉ). 141 + 1 = 142. దీనిని 7 చేత భాగించాలి.
    (ఊ). 142/7 = లబ్ధం 23. శేషం 1.
    శేషం 1 కనుక 1 - 1 - 2012 తేదీ ‘ఆదివారం’.

    ReplyDelete
  37. నెలల సంకేత సంఖ్యలు -
    జనవరి - 1; ఫిబ్రవరి - 4; మార్చి - 4; ఏప్రిల్ - 7; మే - 2; జూన్ - 5; జులై - 7; ఆగస్ట్ - 3; సెప్టెంబర్ - 6; అక్టోబర్ - 1; నవంబర్ - 4; డిసెంబర్ - 6.

    శేషం -
    1 - ఆదివారం; 2 - సోమవారం; 3 - మంగళవారం; 4 - బుధవారం; 5 - గురువారం; 6 - శుక్రవారం; 0 - శనివారం.

    ReplyDelete
  38. !! subbarao !! గారు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

    ReplyDelete
  39. అమృ త పాన మ్ము మరణంబు నంద జేసె
    -----------
    రాహు కేతుల బ్రతికించె రయము గాను
    అమృత పానమ్ము ,మరణంబు నంద జేసె
    త్రాగు బోతుని నడి రోడ్డు దారి లోన
    మద్య పానం బు నేరికి మంచి గాదు

    ReplyDelete
  40. శు భా కాంక్షలు
    ----
    ఆది దంపతు లైనట్టి యాది దేవు
    లాయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రెప్ప యట్లయి గాచు గాత!
    కంది శంకరు గురువుని గరుణ తోడ .

    ReplyDelete
  41. నీ రజాక్ష !
    ఆశ లన్నియు నడి యాశ లయ్యె నేడు
    వచ్చు ననుకొన్న భాగంబు వ్రయ్య లయ్యె
    నేమి సేతును సెప్పుదు నెవరి తోడ ?
    నిన్నె నమ్మితి నిరతము నీ రజాక్ష !

    ReplyDelete
  42. అమ్మా ! వందనమమ్మా!
    ముమ్మరమగు నీ దు కవిత ముచ్చట నిచ్చెన్
    ముమ్మాటికి నిది నిజమే
    అమ్మా ! రాజేశ్వరమ్మ ! యాశిసు లిమ్మా !

    ReplyDelete
  43. గొప్పలు -అప్పులు
    -----
    గొప్పలకు పోయి మనుజులు
    అప్పులు మఱి జేసిరేని యాత్మా హుతులై
    గుప్పెడు బూడిద లగుదురు
    గొప్పల కిక పోక యునికి యొప్పును నెపుడున్ .

    ReplyDelete
  44. కారు లేనిదె కదలవు కాళ్ళు నిచట
    ----------
    కారు లేనిదె కదలవు కాళ్ళు నిచట
    ననెడు మాటలు సత్యము లక్షరాల
    ఎవరు నెచటకు నెప్పుడు నేగ గోర
    కారు లేనిదె వెళ్ళరు వారు నెపుడు .

    ReplyDelete
  45. హైదరాబాదు పయనము .
    ---------
    వెళ్ళుదు నేడవ తేదిన
    వెళ్ళుదు నే నల్కపురికి వెళ్ళుదు స్వామీ !
    వెళ్ళుట కనుజ్ఞ నీయుడు
    వెళ్ళగనే జాయినగుదు వీ ణాకొలువున్ .

    ReplyDelete
  46. వేద మూ ర్తి
    -----
    వ్యాస కృష్ణుల రూపమై వాసి కెక్కి
    వెలుగె తానుగ నిల్చె నే వేద మూర్తి
    యట్టి యె క్కి రాల్వంశ సుధాంశు డైన
    కృష్ణమాచార్య వేడెద కృపను జూప .

    ReplyDelete
  47. ఎవరిని దూరముగా ఉంచాలి ?
    తప్పులను దాను జేయుచు
    నొప్పుల నే జేతు ననుచు జెప్పెడి వానిన్
    నెప్పుడును నమ్మ కుండగ
    నప్పురుషుని దూర ముంచు టొ ప్పును జగతిన్ .

    Zilebi said...
    హమ్మయ్య నను కాదన్నమాట !

    టపా శీర్షిక చదివిన వెంటనే భయపడ్డాను. ! (గుమ్మడి కాయ దొంగ ఎవర్రా అంటే, భుజాలు తడుము కోవడం కాదు గాని!....)

    చీర్స్

    ReplyDelete
  48. పూల పానుపు మీదన పొరలె నావు .
    -----------
    కొత్త దంపతు లాడిరి కోర్కె మీర
    పూల పానుపు మీదన , పొరలె నావు
    కారు మగ జాతి గిత్తతొ గలియ బడుచు
    సాటి ప్రాణుల గూడిక సహజ మిదియ .

    ReplyDelete
  49. శివుని పూజింతు రేకాదశీ దినమున
    ననగ నేల కొ పూజించ నను దినమ్ము
    నుబ్బు లింగడు గద కడు నుబ్బు పోయి
    భూతి నొసగును మనకిక భూరి గాను .
    -------
    మాస శివరాత్రి దినమున మఱు వ కుండ
    శివుని పూజింతు , రే కాదశీ దినమున
    పూలు గ్రుచ్చిన దం డల బూజ సేయ
    భవ్యు డొసగును సంపద భక్తు లకును

    ReplyDelete
  50. సముచిత కార్యము
    -----
    బాధించకు కుల కాంతను
    బాధించిన సిరులు వోవు పతన మె మిగులున్
    బాధింపులు వేధింపులు
    సాధింపులు గట్టి బెట్ట సముచిత కార్యం .

    ReplyDelete
  51. ప్రాణ మాగదు
    ------
    మరణ కాలంబు నాసన్న మైన యపుడు
    కోటి వైద్యులు నక్కడ గూడి యుండి
    నెంత వైద్యము చేసిన నేమి ఫలము ?
    ప్రాణ మాగదు వెడలును ప్రాణి నుండి .

    Zilebi said...
    మరణ కాలమున ప్రాణం ప్రాణిని వదులును
    ఇది సత్యమన్న నిజమేరిగి ఆ ఆసన్న కాలమున
    ప్రాణస్య ప్రాణుని మది నెంచి
    తనువును వైద్యునికి అర్పిమ్పవే జిలేబి -
    తనువు భూమి పరం, మనసు భువి పరం !

    ReplyDelete
  52. అడవి కాచిన వెన్నెల యార దెపుడు
    ------
    వర్మ యోటమి చవి చూడ బ్రతుకు నయ్యె
    అడవి కాచిన వెన్నెల , యార దెపుడు
    పగయు నింకను గౌరవ పాండవులకు
    జాతి వైరము కడదాక సాగు చుండు .

    క్షమిం చాలి .ఇక్కడ కౌరవులు అనగా కాంగ్రెసు వారు
    పాండవులు అనగా వై య స్సారు కాం గ్రెసు వారు
    అను భావనతో వ్రాసాను .

    ReplyDelete
  53. ఇడుమలను బొంది నరుడు సుఖిం చు నెపుడు
    -------
    కష్ట నష్టము లెన్నియొ కలుగు చుండు
    వాటి నన్నిటి దెగనాడు వాడె మనిషి
    సకల బాధలు గలిగించు శనిని వేడ
    ఇడుమలను బొంది నరుడు సుఖిం చు నెపుడు .

    ReplyDelete
  54. మస్త కమ్మును మిం చు నే పుస్త కమ్ము
    ----------------
    సకల శాస్త్ర సమన్విత సం యు తంబు
    అఖిల బుధ గణ సేవిత యాది శక్తి
    ధారణా శక్తి గలిగించు దైవ రూపి
    మస్త కమ్మును మించునే పుస్త కమ్ము ?

    ReplyDelete
  55. తాపసులకు రక్ష దైత్య తతులు
    ----------
    పుడ మి పాలించు ప్రభువులె నడవి నుండు
    తాపసులకు రక్ష , దైత్య తతులు
    రామ రావణ సంగ్రామ రంగ మందు
    నిహతు లయ్యిరి రావణ సహితు గాను

    ReplyDelete
  56. కాటికాపరి ధర గాలు డగును
    -------
    కాటి యందు నుండు కాలు లెంక నరయ
    కాటి కాపరి ధర ,గాలు డగును
    ఆది గురువు శం కరాచార్య తపసులు
    యోగి యటుల నగుట యోగ్య మదియ

    ReplyDelete
  57. పద్య రచన
    ----
    పద్యములు వ్రాయ గలిగిన
    గద్యంబులు వ్రాయు టెంతొ కష్టము కాదూ
    హృద్యముగ వ్రాయు కొరకును
    నాద్యంతము దగు, మెలుకువ లవసర మగునున్ .

    ReplyDelete
  58. విరహ వేదన కతనన వెలది యటుల
    నింద గావిం చు చుండెను నీ శు వలన
    సహజ మయ్యది నింతుల చయిద ములును
    ఈ శు డొక్కడె కాపాడు నెవరి నైన .

    ReplyDelete