అతలా కుతలము సంద్రము ,
వెత లెన్ని యొ గలుగు నట్లు వేత్తలు సెప్పన్
గతము తొ బోలిక జూడగ
గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ .
-----
గతమును దలపకు మయ్యా !
వెత లన్నియు మాయ జేసి వేంకట ప్రభుడున్
గతమే మేలని పించును
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ .
------
గతమెంతొ ఘనమ యందురు
గతము నె మన పూర్వ కవులు ఘనముగ బలికెన్
గతమే సువర్ణ యుగమౌ
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ .
Subscribe to:
Post Comments (Atom)
సురాబ్లాగీయం శ్రీ రావు గారికి,
ReplyDeleteనూతన సంవత్సర శుభాకాంక్షలు మీకూ, మీ సకుటుంబ సపరివార బంధు మిత్రులందరికీ !!
చీర్స్
జిలేబి.
same to you all sir!
ReplyDelete