కందుకూరి మహాశయా !
నీ శుభోదయం ...
రాజమండ్రి పుర వాసుల జన్మ ఫలం
ఆ .....కాదు ,యావత్ ప్రపంచానికే పుణ్య దినం
సంఘ దురాచారాలను
మూఢ ఆచారాలను
తొలగించావు -ఉద్యమాల ద్వారా
నీ ప్రధాన ధ్యేయం స్త్రీ జనోద్దర ణే
అందుకే స్థాపించావు
వివేక వర్ధని
స్త్రీ జాతికి మహోపకారం చేసావు
వితంతు వివాహాల యజ్ఞం గా
అంతే కాదు
పురాణాల తెనిగించి
తెలుగు భాషాభి మానం
చాటావు
తెలుగు వెలుగుల మహనీ యుడా!
నీకు నా నమో వాకములు .
(ఈ రోజు అనగా డిసెంబరు ౧౧ న మొదటి వితంతు వివాహము జరిపించిన సందర్భముగా )
నేను కూడా సరిగ్గా ఇదే విషయం మీద టపా వ్రాసాను. వీలుంటే ఒకసారి చూడగలరు! http://navarasabharitham.blogspot.com/
ReplyDelete