Tuesday, December 6, 2011

సమస్యా పూ రణం

చందమామను ముద్దాడ సాగె చీమ
----------------
నల్ల మేఘంబు లంతట నావహించి
పైడి కొండల నావల పరుగు లిడుచు
చంద మామను ముద్దాడ సాగె చీమ
బ్రతుక బ్రతుక నట్లుండె చుక్క లపుడు .
పాడు లోకము మనుజుల bratuka

42 comments:

  1. ఆదరము గలుగు నెడలన
    మోదముతో నిత్తు రెపుడు మూల్యపు సరుకుల్
    సాదర ,సహితులు నగుచో
    సోదరి దిట్టిన జనులకు శుభములు గలుగున్

    ReplyDelete
  2. హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్
    -------------------
    అనవరత భజన లోలుని
    హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్
    ననునది వినుటకు నొప్పదు
    అనవసరము మాటలాడ నార్యులు నికపై .
    ----------
    క్షంతవ్యుడను
    ----------
    మాన్యులు శంకర గురువులు
    హనుమంతుని భార్యలిద్దరని చెప్పదగున్
    ననునిది పూరణ కిచ్చిరి
    వినసొంపుగ నుండునటుల వివరించండీ.
    ---------

    వినుమది యెవ్వరు సెప్పిన
    హనుమంతుని భార్య లిద్దరని చెప్ప దగున్
    నని నంతనె వేగ పడక
    వినయముగా దాని గూర్చి వివరించు జుమీ

    ReplyDelete
  3. ఒక్కడే కాక వేరొకం డుండు నొక్కొ ?
    -----------------------------
    భార్య తరఫున వచ్చెను బంధు విపుడు
    ఒక్క డనుకొని దెచ్చితి నొక్క ఫలము
    ఒక్కడే కాక వేరొ కండుండు నొక్కొ ?
    యూహ జేసితి నట్టులే నుండె నొకడు .

    -----------
    ఆఖరి పాదము "యూహ జేసితి నట్టులే యుండె నొకడు " అని
    మార్చడ మైనది .గ్రహించ గలరు

    ReplyDelete
  4. భాను కాంతితో తారలు ప్రభల జెలగె
    -----------------------------------భాను కాంతుల వలన నె ప్రజలు నిలను
    భాను కాంతుల వలన నె పక్షి గణము
    లోటు లేకుండ జీవంబు గడుపు నటుల
    భాను కాంతితో తారలు ప్రభల జెలగె .
    ----------
    పై పద్యము మొదటి పాదము లో "ప్రజలు నిలను "

    బదులు "ప్రజలు భువిని" గాను మరియు మూడవ పాదము

    "జీవనము లోటు లేకుండ చేయు నటుల " గా సరిచేయడ మైనది .

    గమనించ ప్రార్ధన .

    ReplyDelete
  5. అన్న భార్య వదిన యగుట కల్ల
    -----------------------------------
    అన్న భార్య వదిన యగుట కల్ల
    యనెడి వారిని చూడ లేదయ్య! నెచట
    చూచు చుంటిని నిప్పుడె చోద్య మలర
    వినుత గుణ శీల ! మాటలు వేయు నేల?
    Posted by subbarao at 7:52 PM
    -------
    సుబ్బారావు గారూ,
    మంచి ఊహతో పూరణ చేసారు. బాగుంది. అయితే సమస్య పాదం ఆటవెలదిలో ఉంటే మీరు మిగతా పాదాలు తేటగీతిలో వ్రాసారు. మీ పద్యాన్ని ఆటవెలదికి మార్చే నా ప్రయత్నం ....

    అన్న భార్య వదిన యగుట కల్ల యనుచు
    ననెడి వారిఁ జూడ నైతి నెచట
    చూచు చుంటి నిపుడె చోద్య మలరుచుండ
    వినుత గుణ! నుడులు వేయు నేల?

    ReplyDelete
  6. లచ్చి మగనికి వచ్చె కళంక మిపుడు
    ---------------------------------------
    పిచ్చి మగనిని యింటను బెట్టి లచ్చి
    కూలి కోసము నేగగ కోట లోకి
    పాలెగాడగు సోముడు పైట లాగ
    లచ్చి మగనికి వచ్చె క ళం క మిపుడు .

    ReplyDelete
  7. ------0--------for 2nd purana

    ఆదరమున భూషావ
    స్త్రాదుల వెసనిచ్చు వారు తమజిహ్వలకున్
    వాదరబలిమి నొకప్పుడు
    సోదరి దిట్టిన జనులకు శుభములు గలుగున్

    ReplyDelete
  8. ఆపదలను దొలచు పాప చయము
    ---------------
    పూల దండల నిను బూజించు మనుజుని
    ఆపదలను దొలచు పాప చయము
    తొలగ జేయ నిపుడ తోయజ నయనాల
    రమ్ము వేగ మిటకు రామ పత్ని

    ReplyDelete
  9. పర హిత మొనరించు వాడె పాపాత్ము డగున్
    -------------------
    పర హితము జేయ గోరుచు
    పరువంబును వీడ నాడి పదుగురి కోసం
    చెరసాల కేగె గోపయ
    పర హిత మొనరించు వాడె పాపాత్ము డగున్?

    ReplyDelete
  10. బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్ .
    --------------
    బోధన మెలకువ లెఱుగక
    శోధనలలు సేయకుండ సూటిక గురువై
    బోధనలు సేయకున్నను
    బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్.
    ---------
    బోధన యన నొక వరమది
    బోధించుట రాని గురువె పూజ్యుం డయ్యెన్
    శో ధించగ పై వాక్యము
    బాధకు లోనయ్యె మనసు పరి పరి విధముల్

    ReplyDelete
  11. సూటిగ అని సవరణ

    ReplyDelete
  12. సూటిగ అని సవరణ

    ReplyDelete
  13. శంకరయ్య గారికి నమస్కారములు.నా పద్య
    సవరణకు కృతజ్ఞుడను.
    -------
    తామిస్రమ్మున నుండిరొ?
    ఆ మువ్వురుమూర్తు లొక్కటైన ఘనుండే!
    తామస గుణపూర్ణమతులు
    తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్

    ReplyDelete
  14. సమరమునే కోరినాడు శాంతిని పొందన్ .
    ----------
    సమరంబున నక్సలుసులు
    యమ పురికిన్నేగి రపుడ యడవుల లోనే
    అమరుల నాయకు డంతట
    సమరము నే కోరినా డు శాంతిని పొందన్ .

    ReplyDelete
  15. పై పద్యము లోని మొదటి పాదము నకు సవరణ;

    సమరమున తీవ్ర వాదులు.

    ReplyDelete
  16. హరుని పూజ సేయ హాని కలుగు
    ----------------
    స్వార్ధ భావనంబు సరగున రానీక
    దైవ భక్తి కలిగి దయగ నుండు
    తరము తరము లకును ధనమును నాశించి
    హరుని పూజ సేయ హాని కలుగు .
    ---------------------
    దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్
    -------
    కరువులును గాట కంబులు
    పెరుగంగా మనన లేక దొరలును సహితం
    దొరలుగ నుండుట కీడని
    దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్ .

    ReplyDelete
  17. కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే
    -------------------
    కుట్టని తేలుల నెరుగము
    కుట్టును నవి దారి పొడుగు గ్రుచ్చుచు పో తూ
    కుట్టుట వాటికి సహజము
    కుట్టనిచో తేలు కాదు కుమ్మరి పురుగే .
    ----------
    పుట్టలలో వేలు పెట్టిన
    కుట్టక మఱి బెట్టు నీ కు? కూడును బుజ్జీ!
    కుట్టుట చీ మల సహజము
    కుట్టనిచో చీమ కాదు కుమ్మరి పురుగే .
    -------
    రెండవ పద్యము మొదటి పాదము
    పుట్టలలో బదులుగా "పుట్టలలొ"
    అని చదువ ప్రార్ధన

    ReplyDelete
  18. తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్ .
    -----------------
    తిమిరాంధ కారమా యిది
    ముమ్మూర్తుల నేక రూపు ముక్కంటినినే,
    తామస గుణ రాహిత్యుని
    తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్ ?

    ReplyDelete
  19. సమస్యా పూరణమ్(భామను నే బెండ్లి ......)
    ఆమరణ దీక్ష బూనిన
    సోముడు మఱి నీరసించి సొమ్మగిలంగన్
    మామయ కోరిక మేరకు
    భామను నే బెండ్లి యాడి బాల్చిని దన్నెన్.
    -----------------
    ఆమరణ దీక్ష బూనిన
    సోముడు మఱి నీరసించి సొమ్మ గిలంగన్
    మామయ కోరిక మేరకు
    భామను పెండ్లాడి యొకడ బలి పశువయ్యెన్ .
    --------------

    ఏమని జెప్పుదు నిప్పుడు ?

    భామను పెండ్లాడి యొకడు పరవశ మయ్యెన్

    మమతల లక్షణ మయ్యది

    మమతాను రాగ ఫలములె పరవశ మగుటౌ.

    -------
    ఏమని జెప్పుదు నిప్పుడు ?
    భామను పెండ్లాడి యొకడు బలి పశు వయ్యెన్
    కామపు లక్షణ మయ్యది
    కామమునకు లొంగ కుండ కట్టడి యొప్పున్

    ReplyDelete
  20. భామను నే బెండ్లి యాడి బాల్చిని దన్నెన్. !!

    భామను బెండ్లాడి వేరుగా బాల్చీ తన్నవలేనా! అదియే బాల్చీ తన్న డానికి సరిసమానము గదా !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  21. దైవ మున్న దె సుతునకు తల్లి కంటె
    -----------
    తల్లి దండ్రుల యందున తల్లి మిన్న
    సుతుని బాగోగు లన్నియు చూచు చుండి
    కంటికిని రెప్ప యట్లయి కాచు చుండు
    దైవ మున్న దె ? సుతునకు తల్లి కంటె ?

    ReplyDelete
  22. అక్షరంబులె దోషికి సాక్షి యగును
    ------------
    బాలు డొక్కడు టెస్టును వ్రాయుచుండి
    కాపి కొట్టుచు నొజ్జల కంట బడెను
    అక్షరంబులె దోషికి సాక్షి యగును
    ప్రశ్న పత్రము నందలి ప్రశ్న జూ డ .

    ReplyDelete
  23. ప్రేమించియె పెండ్లి యాడి పిచ్చిది యయ్యెన్
    -------
    రామంత పురపు బాలుని
    ప్రేమించియె పెండ్లి యాడి పిచ్చిది యయ్యెన్
    చీమంత ప్రేమ నొందని
    సీ మంత పు పెండ్లి కొడుకు చే ష్టల వలనన్

    ReplyDelete
  24. చీమ తుమ్మెను ,బెదరెను సిం హగణము
    ----------
    బాల లందరు సభలోన బాడు చుండ
    బేల యొక్కడు బుడగను బేల్చగాను
    పాఱి పోయిరి మంత్రులు భయము తోడ
    చీమ తుమ్మెను బెదరెను సిం హ గణము

    ReplyDelete
  25. సీ మంతపు పెండ్లి కొడుకు చిందులు వేసెన్
    -----------
    భామకు నెలలున్నిండగ
    మోమున గుంకంబు వెట్టి ముత్తైదువులున్
    సీమంతము జరిపించిన
    సీమంతపు పెండ్లి కొడుకు చిందులు వేసెన్ .

    ReplyDelete
  26. సమస్యా పూరణం( ~ఱాతిని నే ........)
    --------
    ప్రీతి తొ మఱి నిదురించగ
    రేతిరి నొక కలను గంటి రేయంత యునున్
    సీతను మనసున నిలుపుకు
    ~ఱాతిని నే నాతి జేసె రావణు డకటా !

    ReplyDelete
  27. సమస్యా పూ ర ణం(గువ్వం దిని బిల్లి ..
    --------

    అవ్వా ! యేమని జెప్పుదు?
    నివ్వే ళొ క వింత జరిగె నివ్వన మందున్
    రవ్వంత మాంస ముండని
    గువ్వందిని బిల్లి చచ్చి గుర్రం బెక్కెన్.

    ReplyDelete
  28. అల్లరి మూకలను బిలిచి యభినం దింతున్.
    --------
    పిల్లలు సేయుదు రల్లరి
    అల్లరియే వారి కిష్ట మయ్యా !వినుమీ
    కల్లయు కపటము లెరుగని
    అల్లరి మూకలను బిలిచి యభి నందిం తున్.

    ReplyDelete
  29. ఏడడుగుల బంధ మౌర! యేటికి బంపెన్ .
    ---------
    మాడుగుల శేష మాంబకు
    పేడియ యగు వాని తోడ బెండిలి కాగా
    వీడగ ప్రాణము నయ్యెడ
    ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్.

    ReplyDelete
  30. భామకు చీరేల నయ్య ! పదుగురు చూడన్ .
    -------------
    ఏమిది! సుందర విగ్రహ
    మామని నే బోలి యుండి యాకర్షితయై
    యామెతొ సరి బోల గలుగు
    భామకు చీరేల నయ్య ! పదుగురు చూ డన్ .

    ReplyDelete
  31. ఆపన్నుల బంధు వయ్యె నా రావణుడున్ .
    ------------
    ఆపద్బాంధవు డయ్యెను
    నేపొద్దును బిలిచె నేని నేమ ఱుపాటున్
    దాపుం దా రా నీయక
    ఆపన్నుల బంధు వయ్యె నా రావణుడున్

    ReplyDelete
  32. పండితులను దిట్టు వారు పావన చరితుల్ .
    -----------
    ముండనము జేయ నర్హులు
    పండితులను దిట్టు వారు ,పావన చరితుల్
    దండిగ పూజలు సేయగ
    దండములుందప్ప నింక దారియు గలదే?

    ReplyDelete
  33. సంక్రాంతియె మనల జేయు సంపద హీనున్ .
    -----------
    సంక్రాంతి పండుగయ్యది
    సంక్రమణమె రాశి నుండి సను టొక రాశిన్
    సంక్రాంతి ఖర్చు చేయగ
    సంక్రాంతియె మనల జేయు సంపద హీనున్

    ReplyDelete
  34. అశుభ మిరువది పన్నెండు నగును నేమొ ?
    -----------
    పడితి బాధలు వరుసంగ పడితి నెన్నొ
    శంక లిక నుండ బోవని సంత సించ
    ఆశలన్నియు నడి యాశ లగుచు నుండె
    అశుభ మిరువది పన్నెండు నగును నేమొ ?

    ReplyDelete
  35. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్
    --------
    గతమెంతొ ఘనమ యందురు
    గతమునె మన పూర్వ కవులు ఘనముగ పలికెన్
    గతమే సువర్ణ యుగమౌ
    గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్.
    -------

    గతమును దలపకు మయ్యా !
    వెత లన్నిటి మాయ జే సి వేం కట ప్ర భు డున్
    గతమే మేలని పిం చును
    గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్

    ReplyDelete
  36. అతలా కుతలము సంద్రము,
    వెత లెన్నియొ గలుగు నట్లు వేత్తలు సెప్పన్
    గతముతొ బోలిక జూడగ
    గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ .

    ReplyDelete
  37. అమృ త పాన మ్ము మరణంబు నంద జేసె
    -----------
    రాహు కేతుల బ్రతికించె రయము గాను
    అమృత పానమ్ము ,మరణంబు నంద జేసె
    త్రాగు బోతుని నడి రోడ్డు దారి లోన
    మద్య పానం బు నేరికి మంచి గాదు .

    ReplyDelete
  38. పాడి పంటలు పలు భాగ్య విశేషముల్
    సకల భూజనులకు శాంతి సుఖము
    లిచ్చు వేడ్కతోడ వచ్చుచు నీ నూత
    నాంగ్ల వత్సర మభయమ్మొసంగు

    ReplyDelete
  39. ఆంగ్ల వత్సర మభ యమ్ము నొసగు గాత !
    క్రీ .శ .యిరువది పదికి మఱి రెండు
    పాడి పంట సిరులు భాగ్యము గా నిచ్చు
    వత్సరమ్మ ! నీకు వంద నంబు .

    ReplyDelete
  40. చెప్పు దినెడు కుక్క సీమ నేలె
    ----------
    కాళ్ళ కింద నలిగి కదల కుండగ నుండె
    చె ప్పు దినెడు కుక్క, సీమ నేలె
    గనులు లీజు నొంది గాలి సోదరులును
    జైలు పాలు నైరి జనము మెచ్చ

    ReplyDelete
  41. ఆంగ్ల పాలన మనలను నర్ధి జేసె
    ----------
    ఆంగ్ల ప్రభువులు మనలకు నాశ జూపి
    కూడు గు డ్డ లు సహితము కొల్ల గొ ట్టి
    దోచి కొనగను సంపద దుష్ట మతిని
    ఆంగ్ల పాలన మనలను నర్ధి జే సె .

    ReplyDelete
  42. పండిత లోకపు నిందగు
    పండితులను దిట్టు వారు పావన చరితుల్
    ఖండించ వలయు నందరు
    పండితులను గౌర వించ పాలకు లేనౌ

    ReplyDelete