Saturday, December 31, 2011

గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ .

అతలా కుతలము సంద్రము ,
వెత లెన్ని యొ గలుగు నట్లు వేత్తలు సెప్పన్
గతము తొ బోలిక జూడగ
గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ .
-----
గతమును దలపకు మయ్యా !
వెత లన్నియు మాయ జేసి వేంకట ప్రభుడున్
గతమే మేలని పించును
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ .
------
గతమెంతొ ఘనమ యందురు
గతము నె మన పూర్వ కవులు ఘనముగ బలికెన్
గతమే సువర్ణ యుగమౌ
గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ .

Friday, December 30, 2011

ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్

మాడుగుల శేష మాంబకు
పేడియ యగు వాని తోడ బెండిలి కాగా
వీడగ ప్రాణము నయ్యెడ
నేడడుగుల బంధ మౌర !యేటికి బంపెన్ .

ఏడడుగుల బంధ మౌర ! యేటికి బంపెన్ .

మాడుగుల శేష మాంబకు
పేడియ యగు వాని తోడ పెండిలి కాగా
వీడగ బ్రా ణ ము నయ్యెడ
నేడడుగుల బంధ మౌర ! యేటికి banpen

Thursday, December 29, 2011

గీత మార్చును మనుజుల గీత నెపుడు

గీత యనునది యె భగవ ద్గీ త సుమ్ము
గీత బోధించు ,శాసించు నూత నిచ్చు
మాన వత్వంబు నేర్పుచు మనిషి జేయు
గీత మార్చును మనుజుల గీత నెపుడు .

విజయ శ్రీ కలిత గీత ! వేవేల నుతుల్

విజయము నెప్పుడు నీ దే
విజయాలకు దల్లి వీ వ !విజయ విధాతా !
అజరామరము గ వెలిగెడు
విజయ శ్రీ కలిత గీత !వేవేల నుతుల్ .

Wednesday, December 28, 2011

చల్ల గ గాపాడు గీత సైబిరి యనులన్

అల్లదె సైబీ రియనులు
కొల్లలు గా గీత గూర్చి కోర్టుకు నేగన్
చెల్లదని కోర్టు చెప్పగ
చల్ల గ గాపాడు గీత సైబిరి యనులన్ .

చల్ల గ గాపాడు గీత సకల సుజనులన్

అల్లదె గీతా సారము
మెల్లగ నోరార జుర్ర మేదిని యందున్
నుల్లము రంజిల జేయుచు
చల్లగ గాపాడు గీత సకల సుజనులన్ .

చల్ల గ గాపాడు గీత సకల సుజనులన్

అల్లదె గీతా సారము
మెల్లగ నో రా జుర్ర్ర మేదిని యందున్
నుల్లము రంజిల జేయను
చల్లగ గాపాడు గీత సకల సుజనులన్ .

గీత మార్చును మనుజుల గీత నెపుడు

గీత యనునది యె భగవద్గీ సుమ్ము
గీత బోధించు శాసించు నూత నిచ్చు
మానవ త్వంబు నేర్పుచు మనిషి జేయు
గీత మార్చును మనుజుల గీత నెపుడు .

గీత మార్చును మనుజుల గీత నెపుడు .

గీత యనునది యె భగవద్గీ సుమ్ము
గీత బోధించు శాసించు నూత నిచ్చు
మాన వత్వంబు నేర్పుచు మనిషి జేయు
గీత మార్చును మనుజుల గీత నెపుడు .

Tuesday, December 27, 2011

కవి గౌరవ మెల్ల కావ్య గానము చెరచున్ .

కవులెల్ల వంద నీ యులు
కవి గౌరవ మెల్ల నొకడు గానము వలనన్
నవహే గావించిన
కవి గౌరవ మెల్ల కావ్య గానము చెర చున్ .

Monday, December 26, 2011

కాకి -కోకిల సామ్యము (క వర్గము నిషిద్ధము )

రెండును జూడను నలుపులు
రెండును మఱి బల్బు వంటి యండము బెట్టున్
రెండింటి యరుపు భిన్నము
రెండింటను మిన్న తలిరు దిం డి యె నెన్నన్ .

కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్ .

కారము వేసియు ,వేయక
కూరలు రెండింటి జేసి కోమలి వెట్టన్
కూరలను దినిన వెంటనె
కారము లేనట్టి కూర కాంతుడు మెచ్చెన్ .

Sunday, December 25, 2011

పదుగు రాడు మాట పాడి గాదు

ధరను జెల్లునయ్య ! ధర్మ యుతము నైన
పదుగు రాడు మాట, పాడి గాదు
ఒకని మాట వినుచు నొం డు రు ల్గ హింప
కలసి మెలసి యున్న కలదు సుఖము .

కాంత జూచి మౌని కన్ను గొట్టె

వనిత యొకతె మౌని వర్యుని సేవించ
కాంత జూచి మౌని కన్ను గొట్టె
దుష్ట బుద్ది కలిగి దుర్మార్గు డయ్యెను
మునుల నమ్మ రాదు మూఢ మతిని .

దండనము కాదు కాదది పండు వయ్యె

సూటు బూటులు వేసుకు స్కూలు కేగ
అక్షరంబులు నేర్పుచు శిక్ష వేయ
అండ దండలు గలిగిన నయ్యవారి
దండనము కాదు కాదది పండు వయ్యె .
------------
తల్లి గొట్టును దిట్టును దనయు డవని
దండనము కాదు కాదది పండు వయ్యె
మంచి మనుగడ దొరికెను మంత్రి వలన
రు నందలి స్కూలు లొ నొజ్జ గాను .

Saturday, December 24, 2011

జయల లితయు నొందె జగను పార్టి .

జయము జయము ననుచు జనములు జేజేలు
జరుప , పెట్టె పార్టి జగను డనియు
జయ లలితయు నొందె జగను పార్టి జలము
మంచి జరుగు నయ్య మనకు నింక .

త్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?

ఆదు కొమ్మని ప్రార్ధించి హరుని మదిని
సాయ మందిన పిమ్మట సరగు ద్రోల
పాడి యగునయ్య ! మనకది పట్టి జూడ
త్ర్రాతనే పాముగా నెంచి తరుమ దగునె ?
-------------
నిండు సభ లోన కృష్ణయ్య నిబ్బరము
పాండు పుత్రుల కిమ్మ నె పాలు సగము
దుష్ట బుద్ది తొ బంధించ దొడ రె నతని
త్ర్రాతనే పాముగా నెంచి తరుమ దగునె?

Friday, December 23, 2011

సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా ?

సిరి దా వచ్చిన యప్పుడు
సరగున మోకాలు నొడ్డ సరి కాదయ్యా !
సిరియే మూలము మనిషికి
సిరి వలదను వాని కిలను చిక్కులె గాదా ?

శివుని పూజ చేసి చితికి పోయె

సిరులు గూడ గట్టె సీతయ్య నిరతంబు
శివుని పూజ చేసి ,చితికి పోయె
భక్తి హీను డైన భాస్కర రాముండు
పరమ పదము నకిల భక్తి వలయు .

Thursday, December 22, 2011

మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్

పద్యముల నల్ల నేరడు
మద్యము సేవించు వాడు ,మాన్యుడు జగతిన్
హృద్యముగ బాడు మనుజుడు
ఆద్యంతము ముదము జేయు నార్యా రాధ్యా !

పండు టాకు రాలె పాదు నున్న

మామ తోట లోని మామిడి చెట్నున్న
పండు టాకు రాలె ,పాదు నున్న
పింది కూడ వడలి పేశ మయ్యె నపుడు
సత్య మిదియ ,నాటి శైత్యము నన

కాకర వేపుం డె మేలు కాటికి బోవన్

భీకర మగు మధు రోగికి
కాకర వేపుం డె మేలు ,కాటికి బోవన్
వ్యాకులత నొంద కుండగ
శ్రీ కరునే వేడుకొనుము సిద్ధిని బొందన్

వెఱ్ఱి తలలు వేసె వేప చెట్టు

ఆకు మడత పురుగు సోకుంగ చెట్లన్ని
వెఱ్ఱి తలలు వేసె ,వేప చెట్టు
తలలు లేని దగుట వలనన బాగుండె
చెల్లి ! కారణం బు తెలిసి కొనుము .

గంగ మునిగి పోయె గంగ లోన

గంగ పేరు గలుగు గారాబు పట్టియ
బోటు షైరు కేగ విటుని తోడ
వెఱ్ఱి కేక లిడుచు వేమారునరువంగ
గంగ మునిగి పోయె గంగ లోన.

Wednesday, December 21, 2011

కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె

భక్తు లందు మిగుల మారుకం డేయుడ
యధికు డనుట జెల్లు నరయ కాదె ?
ఆత్మ దృప్తి నెరసి నమరుండు గానెంచి
కాలు నమ్మి కొలిచి కాలు గెలిచె.
-----
క్షమించాలి ,మార్కండేయుడ అనుటకు బదులు
మారు కం డేయుడ అన్నాను .

విష గుళిక య య్యె గీ తా వివేక రసము

కన్ను లుం డియు కనులార కనని ప్రజకు
చెవులు నుండియు వినలేని చెవిటి ప్రజకు
కరము లుం డియు పనులేమి కాని ప్రజకు
విష గుళిక యయ్యె గీతా వివేక రసము .

Tuesday, December 20, 2011

మద్యము సేవించు వాడు మాన్యుడు జగతిన్

పద్యముల లల్ల నేరడు
మద్యము సేవించు వాడు ,మాన్యుడు జగతిన్
హృద్యముగను బాడు వాడు
అధ్యయమున దేలెనయ్య!యార్యా రాధ్యా !

మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు .

మాఘ మాసపు తానమ్ము మంచి దనుచు
తల్లి తోడన నేగిన తనయ నదికి
స్నాన మాడుచు జని పోయె సలిలమందు
మాఘ మందున స్నానమ్ము మరణ మొసగు .

సంపన్నుల దైవ మగును శంకరు డె న్నన్

ఇంపుగ మఱి శివ పూజను
సొంపారగ జేసిరేని సూనృత భక్తిన్
సంపదలే నిచ్చు సుగుణ
సంపన్నుల దైవ మగును శంకరు డె న్నన్ .

Monday, December 19, 2011

పాము జూ చి ముంగి పడగ విప్పె .

తోట కేగు చుండ తుప్పల వెంబడి
పాము జూచి ముంగి పడగ,విప్పె
పడగ ముంగి పైకి పాము బు స్సు మనుచు
చూచి పారి పోతి చోరు నివలె.

పాలే సజ్జనుల నెల్ల పతితుల జేయున్ .

పాలే యభి షేకించిన
పాలే నైవేద్య మిచ్చి పాలే ద్రాగన్
బాలా రిష్టపు పలు పా
పాలే సజ్జను నెల్ల పతితుల జేయున్ .

అ న్నా సె ల్లెం డ్రు మరల అమ్మలు నాన్నల్ .

అన్నా సెల్లెం డ్రి రువురు
చెన్నా పట్నంబు కేగి సినిమా చేయన్
అన్నువతో వారయ్యిరి
అన్నా సెల్లెండ్రు మరల యమ్మలు నాన్నల్ .

Sunday, December 18, 2011

దత్త పది ,అతి -గతి -చితి -పతి.

అతియు గతియు లేని పతినిని సేవింప
లాభ ముండు నొక్కొ లబ్ధి బొంద ?
భారతంబు నందు భగవంతు డొ దవెను
చితులు కాల కుండ చేయుడ నెను.

ముక్కంటికి మ్రొక్కు వాడు మూర్ఖుడు జగతిన్ .

ముక్కంటి రచన జేయగ
నక్కసమున దప్పువట్టి నత్కీ రుండున్
రుక్కున బడి చింతించెను
ముక్కంటికి మ్రొక్కువాడు మూర్ఖుడు జగతిన్ .

ప్రాణము లం దీ యు వాడు పరమాత్ముం డౌ.

ప్రాణములు బోయువాడును
ప్రాణములను నిలుపువాడు, ప్రా ణే శుం డౌ
ప్రాణుల కిల దైవంబును
ప్రాణములం దీయువాడు పరమాత్ముండౌ.

ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?

ఇడ్లీ ,పూరీ,వడలును
ఇడ్లీ సాంబారు మరియు ఇడ్లీ చట్నిన్
ఇడ్లీ లు పెసర యట్టుల
ఇడ్లీ లే చాలు మనకు నితరము లేలా ?

Saturday, December 17, 2011

తే నె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె

తేట పదముల వెలుగులు తేనె లొలి కె
తీయ తీయని రాగాలు తీపి చేసె
తేనె లూరించు నన్నింట తియ్య దనము
తేనె బొట్టుతో నంబుధి తియ్య నయ్యె .

ఆంజ నేయున కొప్పెను హస్తి ముఖము .

బ్రహ్మ యొకనాడు కూర్చుండి బాగు గాను
సృష్టి చేయుట పనిలోన దృష్టి వెట్టి
ముఖము నొకదాని కింకోటి ముడిని బెట్ట
ఆంజనేయున కొప్పెను హస్తి ముఖము .

నక్కలు నయ్య డ వి లో న బొక్కలు వెద కెన్.

అక్కా సెల్లెం డ్రొక పరి
చక్కగ వేటాడ గోరి చనిరియ డవికిన్
అక్కడ వీరికి భయ పడి
నక్కలు నయ్యడవిలోన బొక్కలు వెదకెన్.

అస్ఖలిత బ్రహ్మ చారి కార్గురు పుత్రుల్ .

అస్ఖలిత బ్రహ్మ చారిని
నస్ఖలితన్ బుత్రు లార్గు రనుటయు దగునే ?
అస్ఖలితుల కది సాధ్య మ ?
యస్ఖ లితబ్రహ్మ చారి కార్గురు పుత్రుల్ .

బ్రహ్మ చారికి నెన మండ్రు భార్య లౌర !

బ్రహ్మ పదమున కర్ధమ్ము బ్రాహ్మ ణుండు
బ్రహ్మ నె రి గిన ఘనుడయ బ్రహ్మ చారి
నియమ నిష్టల గరిమకు నియతు డైన
బ్రహ్మ చారికి నెనమండ్రు భార్య లౌర !

Friday, December 16, 2011

భరతు డె దిరించి రాముని భాగమడిగె

అమ్మ, సీతను నిన్నును నాదు కొందు
నాదు భాగంబు నిమ్ముము నయము తోడ
రామ ! యడుగు చుంటిని రమ్మిక నీయ గాను
భరతు డె దిరించి రాముని భాగ మడిగె.

పలికి చేసి చూసి కొలిచి యలరు

రామ నామ మరయ రమ్యమైన యదియ
పరుల హితము కోరి పలుకు మిపుడు
నోట ,చేత ,కనుల నూరుమా రులుగను
పలికి చేసి చూసి కొలిచి యలరు .

ఓటుకు నోట్లిచ్చు వారె యుత్తమ నేతల్ .

మాటల మోసము చేయుదు
రోటుకు నోట్లిచ్చు వారె , యుత్తమ నేతల్
గాటమగు నాదరంబున
ఓటుకు తగు ఫలము నిత్తు రౌత్సా హితులై .

Thursday, December 15, 2011

తిరుమలరాయ నికి లేవు తిండియు సుఖమున్

వరముల నిచ్చుచు నరులకు
నరు లిచ్చెడి ధనము తోడ నప్పులు దీర్చన్
సరివోని ధనము కలిగిన
తిరుమల రాయనికి లేవు తిండియు సుఖమున్ .

శ్రీ కృష్ణున కి చ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ .

శ్రీ కృష్ణా ! యదునందన !
నీ కంటెను చెలులు లేరు నా కిపు డ య్యా!
చేకొను మటుకుల మూటని
శ్రీ కృష్ణున కిచ్చె సిరి కుచేలుడు నెమ్మిన్ .

ఎలుకం గని పిల్లి ఛ చ్చె నేనుగు పారెన్ .

కలి యుగ మహత్మ్య మా యిది
యెలుకలు నిట జంపె బిల్లి ,నేనుగు జంటన్
అల నాడొక యుదయంబున
నెలుకం గని పిల్లి చచ్చె నేనుగు పారెన్ .

Wednesday, December 14, 2011

కారు కూతలు కూయ సంస్కర్త యగును

కారు కూతలు కూయ సంస్కర్త యగును
ననెడి మాటలు నిజమైన ,నవని యందు
సంఘ విద్రోహ చర్యలు సమసి పోక
ఉండు బాధలు కలికాల ముండు వరకు .

కారు కూ తలు కూ య సం స్కర్త యగును .

సంఘ సంస్కర్తలు గ నుండి సంఘ మందు
పరువు మర్యాద లన్నియు పార ద్రోలి
కారు కూతలు కూయ ,సంస్కర్త యగును
ననుట వింత గాదె ? జగములు హర్ష మొం దొ?

రమ్ము చేయ గలదు ప్రాణ రక్ష

అక్షరంబు లన్ని యక్షయంబులు గాగ
మంత్ర శక్తి గూడి మహిమ తోడ
పదము పదము కలిసి పంచాక్షరి కి నక్ష
రమ్ము రక్ష్ గలదు ప్రాణ రక్ష .

సమస్యా పూర ణం

కారు కూతలు కూసెను కాకి జంట
-----------------------------------
కాకు లరచును కాకకా కాక యనుచు
కారు కూతలు కూయుట ఖలుల పనియ
కారు కూతలు కూసెను కాకి జంట
అనుట పొసగునె గురువర ! యడుగు చుంటి ?

Tuesday, December 13, 2011

సమస్యా పూ రణం

దత్త పది : పాలు ,పెరుగు ,చల్ల , వెన్న .
---------------------
వెన్న దొంగను గురునాధ ! వేడు కొందు
రాజ్య భాగపు సగ పాలు రమ్యము గను
ఉల్ల మలరగ నిచ్చిన చల్ల గుండ్రు
అంతె కాకయ పెరుగును యశము కూడ .

సమస్యా పూ రణం

బారును సేవించి మంచి బాటను పట్టెన్.
--------------------------------------
కోరిన కోర్కెల కోసము
పారాయణ జేసె నతడు పశుపతి మంత్రం
వేరుగ శివ లింగంబుల
బారును సేవించి మంచి బాటను పట్టెన్ .

Monday, December 12, 2011

సమస్యా పూర ణం

సుర హితమ్ము గోరు శుక్రు డెపుడు.
---------------------
అసుర గురుడు శుక్రు సమాన తేజుడు
ఎల్ల వేళ లందు నుల్ల మలర
గురువు ధర్మ నిరతి గౌరవ ముండ
సుర హితమ్ము గోరు శుక్రు డె పు డు .

Sunday, December 11, 2011

సమస్యా పూ రణం

సమరమునే కోరినాడు శాంతిని పొందన్
---------------------
సమరంబు సేయ నొల్లని
యమ ధర్మజ సుతుడు పంపె యదుకుల ప్రభునిన్
సమతత్వము లేనందున
సమరమునే కోరినాడు శాంతిని పొందన్.

దక్షిణ భారత విద్యా సాగరా !

కందుకూరి మహాశయా !
నీ శుభోదయం ...
రాజమండ్రి పుర వాసుల జన్మ ఫలం
.....కాదు ,యావత్ ప్రపంచానికే పుణ్య దినం
సంఘ దురాచారాలను
మూఢ ఆచారాలను
తొలగించావు -ఉద్యమాల ద్వారా
నీ ప్రధాన ధ్యేయం స్త్రీ జనోద్దర ణే
అందుకే స్థాపించావు
వివేక వర్ధని
స్త్రీ జాతికి మహోపకారం చేసావు
వితంతు వివాహాల యజ్ఞం గా
అంతే కాదు
పురాణాల తెనిగించి
తెలుగు భాషాభి మానం
చాటావు
తెలుగు వెలుగుల మహనీ యుడా!
నీకు నా నమో వాకములు .
( రోజు అనగా డిసెంబరు ౧౧ మొదటి వితంతు వివాహము జరిపించిన సందర్భముగా )

సమస్యా పూ రణం

తునికి సాయ పడుము కనుము సుఖము
-------------------------------------------
మదము ధనము లుండు మనుజుని సేవింప
భయము జెందు రకట బటులు గూడ
ధర్మ బద్ధు డగుచు ధన హీను డైన నా
ర్తునికి సాయ పడుము కనుము సుఖము .

Saturday, December 10, 2011

సమస్యా పూ రణం

దాత విలపించె వేరొక దారి లేక
---------------
దాన ధర్మము కతనన ధనము తరుగ
వట్టి చేతుల బంపక నిష్ట పడక
చేత లేమియు నిక ముందు చేయ లేక
దాత విల పించె వేరొక దారి లేక .

సమస్యా పూ రణం

తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్ .
------------
తామస గుణ వంతుల కిల
తామసమే గోచరించు సములు లోనన్
తామసము లేక పోయిన
తామస గుణ పూ ర్ణు డండ్రు దత్తాత్రేయున్ .

Friday, December 9, 2011

దైవ ఘటన యె వ్వారికి దప్పు ట రు దు.

బ్రాహ్మణ వధను గావించు పాప మతికి
సిరులు నిలువవు బంధువు దరికి రాడు
దిక్కు లేకుండ యూరూర దిరుగు చుండు
దైవ ఘటన యె వ్వారికి దప్పు టరు దు.

శివ సాయుజ్యము

శివ రాత్రి పర్వ దినమున
శివ శివ యని పలుకు నంత శివ సాయుజ్యం
భవ! యని బలుకును భవు దట
భవ భవ యని పలుక రాదె భాగ్యము కొరకై .

Wednesday, December 7, 2011

Tuesday, December 6, 2011

సమస్యా పూ రణం

చందమామను ముద్దాడ సాగె చీమ
----------------
నల్ల మేఘంబు లంతట నావహించి
పైడి కొండల నావల పరుగు లిడుచు
చంద మామను ముద్దాడ సాగె చీమ
బ్రతుక బ్రతుక నట్లుండె చుక్క లపుడు .
పాడు లోకము మనుజుల bratuka

చాటువులు

తమ యీ సమస్య పూ రణ ,
సమస్య గా మారెనయ్య! శంకరు సామీ !,
సమయములు కుదర నందున ,
సమ భావము లీ యనేర సారీ యండీ!
-----------------------------------
నమములు గురు తుల్యులకును ,
నమములు మఱి శంకరయ్య సామికి నమముల్,
నమముల తొ గోరు చుంటిని ,
నిమ్ముగ నడ్రస్సు మీ ది నీ యుడు నిచటన్ .
--------------------
నవ వధువు జూడ మధురము ,
నవ నవ లాడంగ నుండి నవ్వుల మోమున్ ,
నవ్వులను గలుగ జేయుచు ,
సద్వనిత బేరు పొందు సహ వనితల లోన్ .
-----------------------------------------