అయ్యా!
నమస్కారములు."హృదయాకాశం" అను అంశము.
---
ఒకకందము,ఒకతేటగీతి,ఒకసీసము వ్రాసాను
---
కందమునకు "భ,జ,స,నల,గగ అనుగణములు.మాత్రాఛందస్సు.నాలుగుమాత్రలుఒకగణము.లఘువుకుఒకమాత్ర,గురువుకురెండుమాత్రలు.ఒకటి,మూడవపాదములకు మూడుగణములు రెండునాలుగుపాదములకు ఐదుగణములు.రెండునాలుగుపాదములలో నాల్గవగణముమొదటిఅక్షరంయతి.ప్రాసనియమముగలదు.ప్రాసయతిలేదు.రెండునాలుగుపాదాలలోచివరిఅక్షరంగురువేఉండాలి.రెండునాలుగుపాదాలలోమూడవగణం నలగణముగానిజగణముకానిఉండాలి
-------
తేటగీతికి వరుసగానాలుగుపాదాలలోనుఒకసూర్యగణము రెండుఇంద్రగణములుమరలరెండుసూర్యగణములు ఉండును.ప్రాసనియమములేదు.ప్రాసయతి చెల్లును
----
సీసమునకు నాలుగుపాదములలోనుఆరుఇంద్రగణములురెండుసూర్యగణములు ఉండును.ఒకటవగణం మొదటిఅక్షరంమూడవగణంమొదటిఅక్షరం మరలఐదవగణంమొదటిఅక్షరంఏడవగణంమొదటిఅక్షరంయతి చెల్లును.చివరన ఆటవెలదిగానితేటగీతిగానిఉండవలెను.ప్రాసనియమములేదు
---
కం. హృదయాకాశమువెదకగ
హృదయమునుప్పొంగుసుమ్మునేరికినైనన్
హృదయమునిర్మలమగునెడ
సదయుండైయిచ్చుసుగతిశంభుడునెపుడున్
----
తే.గీ. ఆకసంబునుజూడగహ్లాదమొసగు
రిక్కగమితోడవెలుగుచుఱేయియందు
క్రొత్తజంటకువలపులుగూర్చుచుండి
స్వర్గసుఖములనందించుసరసరతిని
---
సీ.హృదియనుగగనమ్ము హృద్యమౌరీతిని
తారాపధంబున తళుకులలరె
రిక్కగములవోలె లెక్కకుమించిగా
రక్తనాళంబులురక్తికలిగి
శంభునినామంబు సాదరమొప్పగా
నాభికుహరమందు నాట్యమాడ
నురముననుండుచు నుయ్యాలజంపాల
నూగులాడెడుగుండెమ్రోగుకతన
ప్రాణమున్నట్లుభావించిపరమశివుని
వేడుకొనుముర జీవుడ!వేడ్కతోడ
ననుచు సందేశ మిచ్చెనా!నాహృదయమ
నెడుగగనమనిదోచెనునెమ్మిమీర
--------
పోచిరాజు సుబ్బారావు
(flat 20A/1.plot 302,R.Residency
prabhat nagar,kothapet
chaitanyapuri,hyd -60
cell.9866283384)
No comments:
Post a Comment