కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా
ఆశలు లేక యుండుటకు నాశను బోవుదు రెల్ల వారునున్నీశ! విచిత్ర మిచ్చటను నీకవి కోరెను ధాన్య సంపదన్
లేశము కూడ లేదు మతి లీలగ మాత్రము భక్తి భావమున్
కాశికిఁ బోయినట్టి కవి కాంక్షలు మిక్కుట మయ్యె నక్కటా
ఆశలు లేక యుండుటకు నాశను బోవుదు రెల్ల వారునున్కాంక్ష లేమిని గోరుచు గాశి కేగి
గంగ యందున మునుగుచు గంగ పాలుతనకు దొరికిన స్వల్పమౌ తరుణ మందె
దేశదారిద్ర్యచరితమున్ దిరుగవ్రాసి
భరతభాగ్యవిధాతయై వరలి నట్టి
ఘనుడు పీవీని దలచిన గర్వము కద
అల్పబుద్ధుల కందరా నట్టి మేధ
గౌరవము కన్న నీర్ష్యనే కాంచె నకట
మృతి పిదప నుబ్బి పడియె నా యీర్ష్య పెంపు
గౌరవము గాక న్యూనతన్ గాంచె శవము
వివశత గల్గ జేసెనట వేయివి ధంబుల పద్య పోకడల్
కవనము జెప్పి యెల్లర క,కారణ శత్రులు గారె సత్కవుల్భవు సోదరి కా త్మీయులు
కవనమ్మును జెప్పు కవు ల,కారణ శత్రుల్
కవనపు దోషము దెలుపుచు
సవరణ లన్ జేయువారు సములకు నెచటన్
హృద్యము గాగ పద్యములు హెచ్చుగ వ్రాసెడు శక్తినీయునా
విద్యగడించెపండితుడు, వింతమృగంబుగ సంచరించెనే
విద్యలు చాల నేర్చిన వి వేకము లేకను సీతదె చ్చుటన్
నింద్యుడు గాజగంబునను నేరము చేసెను లోకనింద్యమే
మెండుగ రచనలు సేసెను
పండితుడై,వింత మృగము పగిది జరించెన్
దండిగ చదువులు సదివిన
పండితుడగు రావణుండు పామరుని వలెన్
అక్కా! చెప్పుమ యీయది
కుక్కకు జెమ్మటలు వొడమకుండునె సతమున్శ్రేయం బీయుత యెల్ల వేళల నుదా శీఘ్రంపు టాలోచనన్
శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియైశ్రేయము గూర్చగ నిరతము
శ్రీయుతు లౌ చదు వువలన శీఘ్రము గదగన్కాప్రా నామక పురమున
నప్రతి హత యీర్ష్య తోడ యచ్చటి జనముల్
విప్రుల గూరిచి యిటులనె
విప్రులు మాంసమ్ముఁ గొనిరి వేడుకతోడన్
సరిగమల మయము లగుచును
నరుదగు గానముల చేత నలరించెడునాఓమా లోకమ యేమి దౌష్ట్యమునిటన్ నూహించ రానట్లు ,రా
రా,మాపుత్రుని జంపినావుగద నిర్దాక్షిణ్య చిత్తుండవైఓమా లోకమ ! యెందుకు
రా,మాసుతు జంపినావురా నిర్దయతన్
నేమీ ద్రోహము జేసిరె
యేమాయెను నీకు చెపుమ నిటులుగ జేయన్
సెల్ఫో నంబను సాధనంబది గనన్ జేజీయ మానంబుగా
సెల్ఫుల్ దీయగ వీలు గల్గును నికన్ జేవ్రాత లేకుండ నౌసెల్ఫోను గురిచి యీయది
సెల్ఫోన్ కరభూషణమని చెప్పెదరు కవుల్subbaraoఆదివారం, జూన్ 19, 2022 5:52:00 AM
సీత యొడిలోన రామయ్య సేద దీర
పుండు జేయు వా యస మును జూచి పోచ
పంప రాముడు ,పొడుచుచు జంపె నపుడు
సూత్రి రూపాన నున్నట్టి యాతివునిల
మిగుల పాపము గదరమ!జగము నందు
భ్రూణహత్యల జేయుట,పుణ్యమగునుతలలన్ జింపిరి చేసెనే గమల! చిత్తంబున్ బ్రలోపించగా
దలుపుల్ దన్నెను వేగవం తముగ బాదాలన్ సమూలంబుగాపంకజ నాభుని మిత్రుడు
సంకటముల దుడిచి పెట్టు శక్తియు తుండున్విగత మనస్కురాలగుచువేగ మెనేగెనుబుట్టి నింటికిన్
మగనినిఁ దిట్టి యొక్క సతి, మాన్యతఁ గాంచెను విజ్ఞులౌననన్విగతమ నంబున గుమిలెను
మగనినిఁ దిట్టి యొక సుదతి, మాన్యతఁ గాంచెన్సత్స్నేహంబును గూర్చి యీవిధ ముగా సంభాష ణం బత్యాశ యే
సత్స్నేహం బొనరించ దక్కు నిడుమల్ సత్యంబు ముమ్మాటికిన్సత్స్నేహంబున గావివి
సత్స్నేహముఁ జేయ దక్కు సంకట చయముల్వినుమురభార తంబునిల వేయిరకంబులుగా రచించినన్
వినదగునట్లుగాసరగు వీనులకింపుగనుండు గావునన్శంకరు లింగాకారుడు
పంకజ నాభుని సఖుడును భక్తవరదుడున్అరుసం బొందుచు నాత్మలో మిగుల యమ్మౌకాళికామాత,శాం
కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా
కరమున్ భక్తిని బూజసే యునెడ యక్కామాక్షి వేగంబె శ్రీ
కరమౌ సంఘట లెన్నియోయిడుత సాకారంబుద్యోతించగా
వీడు వాడనుచును వేరుభావ ములేక
యంద రొక్క రె యని యాత్మ దలచిఅరయ దరమె నీ గరిమను
దరతరములకును సరిపడు తైలపు ద్రవముల్ ,విపినము జొచ్చి యుగ్రముగ వేయివిధంబుల బాడు జేసెనే
కపివరు లెల్ల నేఁడు ,గనఁగాఁ గవివర్యులె యైరి వింతగన్బాలలు పాఠశాలలకు బారులు దీరుచు బోయియ చ్చటన్
ఫాలుని సంస్మరించియిక పాఠము లేవియు నేర్వబో కయున్
జాలని కొంటె వేషముల సాటిగ నుండెడు శారదాంబతోన్
మేలము లాడుచుండెనట మీరనిహాస్యము జేయునా బాలయే
తగుదునని వచ్చి తీరుపు
లగణితముగ జెప్పి తగవు లధికము జేయన్తగుదును గాక యంచునిక తాలిమి లేకను దప్పు సాక్షులన్
నగణిత మౌవిధంబుగను నాయత రీతిని జెప్పువారలన్విమల మనస్కురాలయును భీకర యుద్ధము సాహసంబుతో
నరియగు రాక్షసాధమునినాయువు పట్టునవేసిబాణముల్
రమయనబార్వతీసతియు,రమ్యసులోచనిగారణంబునన్
రమ శివపత్నియై ,మహిషు ప్రాణములంగొనె సంగరంబునన్
శార్దూలం
కావేరీతటవాస రంగ వరదా కారుణ్య రత్నాకరా
భావాతీత గుణాధిపా సురవరా భాగ్యోదయా భూవరా
దేవా దీనజనావనా ఖగరథా దేవీరమా సేవితా
నీవేదిక్కని నమ్మియుంటిమి హరీ నీరేజ పత్రేక్షణా!
సీ.
ఆదిరంగడవందురా కన్నడిగులెల్ల
శ్రీరంగపట్టణ స్థిరనివాస
మధ్యరంగడవంచు మనుజులు కొలిచేరు
శివసముద్రనిలయ చిద్విలాస
శ్రీరంగపురధామ శ్రీరంగనాథుడ
శ్రీరంగనాయకీ చిత్తచోర
అంత్యరంగడనుచునందురు భక్తులా
ళ్వారులెల్ల భువిని బ్రణుతి జేసి
తే.గీ.
రంగనాయకీ తాయారు రమణిగూడి
భక్త కోటిని గావగ వైనతేయ
వాహ భువిని వెలసినావు వరములీయ
కోటి వందనాలు గొనుమ కోమలాంగ!
నివేదన#
(పద్య ఖండిక)
బుగ్గలందు సిగ్గు మొగ్గలు పూయంగ
బెదురు చూపులెల్ల గుదురు కొనగ
నీలిమబ్బు జిలుగు నేలపై తారాడ
కాలి మువ్వ లెల్ల గేలి చేసె
నీలిమబ్బు తునుక నీలాటి రేవులో
ముత్యమయ్యె నడుము ముడత పైన
త్రోవ తడిసి పోయె పావడా పరిగెత్తె
పూల పరిమళమ్ము ముసిరె నంత
నీలి కాంతిరేఖ లీలగా నిలుజొచ్చి
నిద్రకూరుకనుల ముద్రలిడగ
పరవశంపు టొడలు విరిదండగా మారె
పొగులుచు మొలనూలు బిగువు సడలె
నల్లమబ్బుముక్క నాతిని వెన్నంట
ఉల్లమందు నొక్క ముల్లుగుచ్చె
వెండి వెల్గు వాన యెండవేడిమి చూప
చీకటింట గదిని చేరె దనువు
అలసి సొలసి పడక నట్టులనొరగంగ
నిదుర పొరల గన్ను లొదిగి పోయె
నీలి కాంతి రేఖ పూల తేనెలు త్రాగి.
పెదవి పండు కొరికి ముదము గూర్చె.
డా. ఉపాధ్యాయుల గౌరీ శంకర రావు
చప్రము వేసియా స్దలము శాస్త్రపు రీతిని శుభ్రపర్చి యున్
దీప్రపు గుండమున్ నునిచి దీటుగ మాంసము వేదప ద్ధతిన్
క్షిప్రము హోమమై దనర శేషపు హారము నంతయున్ నికన్
విప్రవరుల్ దమిం గొనిరి వేడ్కగ మాంసము శాస్త్రపద్ధతిన్