Friday, March 27, 2020

కరోన

వెచ్చటినీటనుదేనెను
పచ్చటియానిమ్మరసము,పసుపుగలుపుచున్
 నిచ్చనుద్రాగినయయెడలను
మచ్చునకున్సోకదంటమాయకరోనా
--
న్యూయార్కునగరమందును
 మాయాజాలమ్ముగలిగిమనుజులతోడన్
 వేయివిధంబులనాడుచు
 నాయముపాశంబుజుట్టునట్లుగజేసెన్

 పెద్దజాడ్యమౌచు,కరోనబేరబఱగి
పుట్టిచీనానదేశాలుమట్టిగఱపె
నేమిపాపముజేసితిరేమొకాని
 కూలుచుండిరికొందఱు కోలుకొనక

 వేలువేలుగజనములు విగతులౌట
యాటబొమ్మగనుండెనా యభవ!నీకు
నంతకంతకుజెలరేగియాకరోన
 పీనుగులమయముగమార్చెబృధివినంత

 ఇప్పటికైననుశంకర!
 యప్పగతునిరూపుమాపియాదుకొజగమున్
 నెప్పుడునిన్నేకొలుతురు
 నప్పవుమఱినీవయనుచునందరుసుమ్మీ

ఏమనిజెప్పనొప్పుదునునీశ్వర!గావుమయీకరోన,మా సేమమునూడలాగుటకుజిత్రముగానరుదెంచెనిత్తరిన్ భామలువృద్ధులున్మఱియుపాపలుపోయిరిసోకినంతనే కోమలపుష్పపత్రమిదెకొండనుజీల్చెగనంగజిత్రమే


పెరుగుచుండెనుచావులు భీకరముగ
 వేడుచుంటినినియతినివిశ్వనాధ!
కాల్చివేయుమమూడవకంటితోడ
నీభయంకరభూతమునిప్పుడిచట

మమ్మువదలిపోవు
 యోకరోనతల్లి!యుండిమమ్ము
విగతజీవులుగను,భీతిలుగనుజేయ
కమ్మ!నతులనిడుదుబేర్మితోడ


No comments:

Post a Comment