సీ: ఆధ్యాత్మ సాధనన్నాత్మ విశ్వాసాన
మునులకు గల్గెగా మూడుకనులు
భారతీయతలోని పావిత్ర్యముంజేసి
గ్రహమండలంబనుగ్రహము జూపు
యోగసిద్ధినిబొంది యోగాగ్నిలో గాలి
యోగులై తపియించు త్యాగులున్న
సద్యోగ నిష్ఠచే శక్తులసాధించి
ప్రార్ధించిగగనాన పయనమైన
సద్భక్తి విజ్ఞాన శారదా సత్కృపన్
పదునాల్గు లోకాల పాదమిడిన
పుణ్యకర్ముల చెంత పుట్టవే వైరసుల్
పుట్టిన వెంటనే గిట్టునయ్య
ఈ " కరోనా" వంటి వెన్నైన వైరసుల్
మనధ్యాన శక్తిచే మట్టిగలియు
దైవయోగంబుగా ధ్యాన మబ్బు కతన
దుర్నిరీక్ష్యముగాదె దుష్టులకును
తే.గీ: పరమపావిత్ర్య స్థలమిది భరతభూమి
నమ్మి చెడిపోయి దుఃఖించు నరుడులేడు
ఆత్మ విశ్వాసమొక్కటె యాయుధమ్ము
దాని వలననె సర్వంబు తరలివచ్చు.
యోగసాధన బరచింత యుతుడునగుచు
దైవమందునమనసునుదిటముబఱచి
దీపకాంతులుగగనానదేజరిల్ల
వరుసవరుసగ వెలిగించుప్రమిదనవము
మాడిపోవును వైరస్సుమసిగమారి
భార తీయులనైక్యతవర్ధిలగను
పిల్ల పెద్దలుకలిసిచప్పట్లుకొట్ట
యంతమగునుకరోనయేచింతవల
No comments:
Post a Comment